న్యూ ఇయర్ పార్టీ ముందు.. ఇవి తింటే హ్యాంగోవరే ఉండదు..!!
Velpula Bharath Rao
31 December 2024
అయితే మద్యం తీసుకునేటప్పుడు ఏం తెలీదు. ఆ తర్వాత కొత్త సంవత్సరం నాడు ఇబ్బంది పడుతూ ఉంటారు. హ్యాంగోవర్‌తో నానా తంటాలు పడుతూ ఉంటారు.
తలనొప్పి, వికారం, అలసట వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అయితే వారికోసం వైద్యలు ఓ పరిష్కారానికి సూచించారు. అదేంటో క్లీయర్‌గా తెలుసుకుందాం..
మందు తీసుకునే ముందు చీజ్ తినడం వల్ల హ్యాంగోవర్ సమస్య ఉండదు. ఈ చీజ్‌లో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటుంది కాబట్టి మందు తాగే ముందు చీజ్ తీసుకోవడం బెస్టు
ప్రతి పెగ్ తర్వాత వాటర్ తాగాలి. అంటే ఒక గ్లాస్ మందు తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీరు తాగితే దాని పవర్ అంతగా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్, కాక్టెయిల్స్ తాగడం మంచిది కాదు. మందు తాగడంతో పాటు నిమ్మరకం తీసుకుంటే ఆల్కహాల్ ప్రభావం అంతగా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సాధ్యమైనంత వరకు మందు తక్కువ తాగి, రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీళ్లు తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నైట్ మందు సేవించిన తర్వాత ఉదయం లేవగానే అల్లం, తేనె బ్లాక్ టీ తీసుకోండి. ఇలా చేస్తే కడుపులో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి.
పెరుగు తినడం కూడా మంచిది. పెరుగులో ఉండే యాసిడ్ కడుపులో ఉన్న సమస్యలను దూరం చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.