పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఈ పదార్థాలకు దూరంగా ఉండండి..

ప్రస్తుత కాలంలో చాలామంది సంతానలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. అలాంటి వారు కొన్ని విషయాలపై అవగాహనతో ఉండాలి.. పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే కొన్ని ఆహారాలను తీసుకోవద్దని సూచిస్తున్నారు. అలాచేయడం వల్ల గర్భధారణకు అవసరమైన స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం బెటర్.. అవేంటో తెలుసుకోండి..

పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఈ పదార్థాలకు దూరంగా ఉండండి..
Male Fertility
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 30, 2024 | 4:12 PM

ఆధునిక కాలంలో చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.. దీనికి ముఖ్యకారణం పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. నిపుణుల ప్రకారం.. గత 40 ఏళ్లలో పురుషుల స్పెర్మ్ కౌంట్ ప్రపంచవ్యాప్తంగా 50-60% తగ్గింది. ఈ సమస్య ఇప్పుడు చాలా తీవ్రంగా మారిందన్న.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని ప్రపంచ ప్రజారోగ్య సంక్షోభంగా అభివర్ణించింది. ఒక అధ్యయనం ప్రకారం, దాదాపు 50% జంటలలో గర్భం దాల్చడంలో సమస్యలు ఉన్నాయి.. దీనికి స్త్రీ, పురుష కారకాలతోపాటు.. పలు విషయాలను కారణంగా చూపించింది.

పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గడం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి.. అయితే మంచి విషయం ఏమిటంటే, ఈ సమస్యకు సరైన ఆహారం ఒక ప్రధాన కారణమని పరిశోధనలో కనుగొనబడింది. అంటే మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు స్పెర్మ్ కౌంట్‌ని మెయింటెయిన్ చేయగలిగే వాటిని తీసుకోవడం.. అలాగే.. వీర్యకణాలను దెబ్బతీసే ఆహార పదార్థాలను నివారించడం ద్వారా సంతానలేమి సమస్య నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మీరు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నా.. లేదా గర్భం ధరించడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే కొన్ని ఆహారాలను తీసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్పెర్మ్ కౌంట్, నాణ్యతను దెబ్బతీసే ఎలాంటి ఆహారాల పదార్థాలకు దూరంగా ఉండాలి..? అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

సోయా ఉత్పత్తులు: సోయా పాలు – టోఫు వంటి సోయా ఉత్పత్తులు సాధారణంగా ఆరోగ్యంగా పరిగణిస్తారు. కానీ మీరు బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే వాటిని నివారించండి. సోయాలో అధిక మొత్తంలో ఐసోఫ్లేవోన్లు ఉంటాయి.. ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ లాంటి ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇది స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించవచ్చు.

సోడా – ఎనర్జీ డ్రింక్స్: సోడా, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ స్పెర్మ్ చలనశీలతను, గణనను తగ్గిస్తాయి. ప్రతిరోజూ ఒక లీటరు సోడా తాగడం వల్ల స్పెర్మ్ మొటిలిటీ 30% తగ్గిపోతుంది.. స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుందని పరిశోధనలో తేలింది.

ప్యాకేజింగ్ ఆహారాలు: క్యాన్డ్ లేదా టిన్డ్ ఫుడ్స్‌లో బిస్ఫినాల్ (BPA) అనే రసాయనం ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ లాగా పనిచేస్తుంది. ఇది పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. స్పెర్మ్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, క్యాన్డ్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించాలి.

అధిక కొవ్వు పాల ఉత్పత్తులు: జున్ను, ఫుల్-క్రీమ్ మిల్క్ వంటి అధిక కొవ్వు పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం పురుషుల సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది. దీని వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ప్రాసెస్ చేసిన మాంసాలు: బేకన్, సలామీ, బీఫ్ జెర్కీ, హాట్ డాగ్‌ల వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో నైట్రేట్‌లు, స్పెర్మ్ ప్రకోపకాలుగా పనిచేసే ఇతర రసాయనాలు ఉంటాయి. ప్రాసెస్ చేసిన మాంసాల వినియోగం పురుషులలో స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుందని, చలనశీలతను ప్రభావితం చేస్తుందని పరిశోధన కనుగొంది.