TTD: అయ్యో దేవుడా.! శ్రీవారి పరకామణిలో రూ.100 కోట్లు కొట్టేసారా..? వీడియో

TTD: అయ్యో దేవుడా.! శ్రీవారి పరకామణిలో రూ.100 కోట్లు కొట్టేసారా..? వీడియో

Anil kumar poka

|

Updated on: Dec 30, 2024 | 11:26 AM

తిరుమలలో అత్యంత పరమ పవిత్రంగా భావించే పరకామణిలో దొంగలు పడ్డారా? భక్తులు ఎంతో భక్తితో హుండీలో వేసే నగదుకు రక్షణ లేదా? అంటే అవుననే అంటున్నాడు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. గత ప్రభుత్వం హయాంలో టీటీడీలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. పరకామణిలో 80 వేలు చోరీ చేశాడని చెబుతున్న వ్యక్తి నుంచి భారీ స్థాయిలో ఆస్తులను టీటీడీకి రాయించుకోవడం ఏంటని ప్రశ్నించారు.

నిందితుడు రవికుమార్‌పై 2023లో కేసు నమోదు చేసినా.. ఓ పోలీస్ అధికారి విచారణ చేయకుండా ఒత్తిడి చేశారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఆ అధికారి ఎవరని ప్రశ్నించారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీటీడీ బోర్డు చైర్మన్‌ను కోరినట్టు తెలిపారు. పరకామణిలో జరిగే లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే పెద్ద జీయర్ మఠానికి చెందిన ఉద్యోగి రవికుమార్ చేతివాటం వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలంటున్నారు భాను ప్రకాష్.

2023 ఏప్రిల్ లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం పై విజిలెన్స్ ఇచ్చిన నివేదిక, లోకయుక్తా లో జరిగిన రాజీ వ్యవహారం పై ఎంక్వయిరీ కమిషన్ కు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పరకామణిలో పెద్ద జీయర్ తరుపున విధుల్లో ఉన్న సివి రవికుమార్ గత కొనేళ్ళుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు 2023 ఏప్రిల్ 29న కేసు నమోదు అయ్యింది. రవికుమార్ ను అరెస్టు చేయకుండా 2023 సెప్టెంబర్ లో లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడాన్ని బాను ప్రకాష్ ప్రశ్నించడంతో వ్యవహారం వెలుగులకు వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.