30 December 2024
Pic credit -Social Media
TV9 Telugu
శీతాకాలంలో గోంగూర, తోటకూర, మెంతి కూర, బతువా, పాల కూర వంటి అనేక రకాల ఆకుకూరలు ఎక్కువగా తింటారు. ఇవి మాత్రమే కావు ఎర్ర తోట కూరని కూడా తినే ఆహారంలో చేర్చుకోండి.
తోట కూరలో రకరకాలున్నాయి. మొక్క తోట కూర, చిలుక తోట కూర, తోట కూర, ఎరుపు తోట కూర. ఈ ఎర్ర తోట కూరని ఈ సీజన్ లో తినడం వలన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?
పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుపచ్చ, ఎరుపు కూర రెండో ప్రకృతి ప్రసాదమే.. శీతాకాలంలో దొరికే ఎర్ర తోట కూరని తినే ఆహారంలో చేర్చుకుంటే అనేక రకాల ప్రయోజనాలున్నాయి.
ఎర్ర తోట కూరలో మంచి మొత్తంలో ఐరన్ ఉంది. దీనిని తినడం వలన రక్తం పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చక్కటి ఆకుకూర.
ఎర్ర తోట కూర వేడి స్వభావం కలిగి ఉంటుంది. అంతేకాదు కాల్షియం సమృద్ధిగా ఉంది. అందువల్ల ఎముకలకు మేలు చేస్తుంది, ఇది కీళ్ల నొప్పులను నివారిస్తుంది.
ఎర్ర తోట కూరలో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌తో పోరాడడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. కనుక ఈ ఆకు కూరని తినడం వలన గుండెకు మేలు చేస్తుంది.