ఆడవారికి ఋతుచక్రం ప్రతి నెలా వస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరికీ ఒకేలా ఋతు రక్తస్రావం ఉండదు. భిన్నంగా ఉంటుంది. అయితే కొందరికి భారీగా రక్తస్రావం అవుతుంది. దీంతో నీరసించి, మంచానికే పరిమితం కావల్సి ఉంటుంది. పీరియడ్స్ (ఋతుచక్రం) సుమారు ఐదు రోజులు ఉండాలి. అయితే అధికంగా బ్లీడింగ్ అయ్యేవారికి మాత్రం పీరియడ్స్ ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. ఫలితంగా ప్రతి గంటకు ప్యాడ్ మార్చాల్సి వస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలో కూడా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. అలాగే పీరియడ్స్ ఆగిపోయిన కొన్ని రోజుల తర్వాత మళ్లీ ప్రారంభమైనా తీవ్రంగా పరిగణించాల్సిందే.