- Telugu News Photo Gallery Cinema photos GV Prakash, nephew of AR Rahman and Singer Saindhavi announce separation after 11 years of marriage
G. V. Prakash : విడిపోతున్న మరో జంట.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన జీవి ప్రకాష్ దంపతులు
సినీ ఇండస్ట్రీలో విడాకుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది స్టార్ నటీనటులు వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కం నటుడు జీవి ప్రకాష్ దంపతులు కూడా విడిపోతున్నట్టు ప్రకటించారు.
Updated on: May 14, 2024 | 2:54 PM

సినీ ఇండస్ట్రీలో విడాకుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది స్టార్ నటీనటులు వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కం నటుడు జీవి ప్రకాష్ దంపతులు కూడా విడిపోతున్నట్టు ప్రకటించారు.

జీవి ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయనకు మ్యూజిక్ అందించారు. తమిళ నాట ఆయన చాలా ఫెమస్. నటుడిగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జీవి ప్రకాష్.

జీవి ప్రకాష్ జంట ఇప్పుడు విడిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకే పోస్ట్ పెట్టారు. తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నట్లు ఇరువురూ తెలిపారు. దాంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

జీవీ ప్రకాష్ 2013లో తన చిన్ననాటి స్నేహితురాలైన సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఓ పాప కూడా ఉంది. ఇంతకాలం అన్యున్యంగా ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు ఇలా సడన్ గా విడిపోతున్నాం అని ప్రకటించారు.

ఎంతో ఆలోచించిన తర్వాతే సైంధవి, నేను మా 11 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రశాంతత, మా జీవితాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రైవసీకి భంగం కలిగించకుండా మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మావి వేరు వేరు జీవితాలు. ఈ నిర్ణయం మా ఇద్దరికీ మంచి చేస్తుందని అనుకుంటున్నాం అని పోస్ట్ చేశారు.




