- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Bhatia on her bad habits says after 8 pm i do not want to work
Tamannaah Bhatia: నాకు ఆ అలవాటు ఉంది.. రాత్రి ఎనిమిది తర్వాత ఆ పనిచేయనంటున్న తమన్నా
తమన్నా ప్రస్తుతం తెలుగులోసినిమాలు తగ్గించింది. బాలీవుడ్ మీద ఈ అమ్మడు ఎక్కవ ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ అలరిస్తుంది. టాలీవుడ్ లో ఒకానొక టైంలో ఈ చిన్నదిస స్టార్ హీరోయిన్ గా రాణించింది.
Updated on: May 14, 2024 | 3:04 PM

తమన్నా ప్రస్తుతం తెలుగులోసినిమాలు తగ్గించింది. బాలీవుడ్ మీద ఈ అమ్మడు ఎక్కవ ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ అలరిస్తుంది. టాలీవుడ్ లో ఒకానొక టైంలో ఈ చిన్నదిస స్టార్ హీరోయిన్ గా రాణించింది.

త్వరలోనే ఈ చిన్నది పెళ్లి పీటలు ఎక్కనుందని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో తేలిపోతున్నారు. త్వరలోనే పెళ్లితో ఒక్కటి కానున్నారు.

ఇదిలా ఉంటే తమన్నా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ మిల్కీ బ్యూటీకి ఓ వింత అలవాటు ఉందన్న విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ విషయం తెల్సిస్తే నిజంగా షాక్ అవుతారు.

రాత్రి ఎనిమిది తర్వాత ఈ చిన్నది ఇల్లు దాటి బాయటకు రాదంట. అవును ఎనిమిది గంటల తర్వాత నైట్ ఎక్కడికి వెళ్లడం కానీ.. ఏదైనా పని చేయడం లాంటివి చెయ్యడంట తమన్నా. అది అంత మంచిది కాదు అని అంటుంది ఈ అమ్మడు.

తెలుగులో దాదాపు అందరు హీరోలతో నటించిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఇటీవలే బాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.