- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna may star in movie with Vijay Deverakonda, Ravi Teja movie Mr. Bachchan shooting update
Tollywood News: రష్మికాకు జోడిగా విజయ్.. స్పీడ్ పెంచిన మిస్టర్ బచ్చన్
రీసెంట్‌గా విడుదలైన హీరామండిలో మల్లికాజాన్ అనే కేరక్టర్‌లో నటించారు మనీషా కొయిరాలా. తాను ఇవాళ ఇంత స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం... ఎన్నిటినో దాటుకుని రావడమేనని అన్నారు మనీషా. రెండేళ్ల పాటు కేన్సర్‌తో పోరాడానని అన్నారు . ఆ సమయంలో చాలా మంది తనని వదిలేసి వెళ్లిపోయారని, ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. కిరణ్ రావు డైరక్ట్ చేసిన లాపతా లేడీస్ సినిమాను ప్రశంసించారు జాన్వీ కపూర్. లాపతా లేడీస్ చాలా స్పెషల్ సినిమా అని, ప్రతి ఒక్కరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారని అన్నారు
Updated on: May 14, 2024 | 6:54 PM

Manisha Koirala: రీసెంట్‌గా విడుదలైన హీరామండిలో మల్లికాజాన్ అనే కేరక్టర్‌లో నటించారు మనీషా కొయిరాలా. తాను ఇవాళ ఇంత స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం... ఎన్నిటినో దాటుకుని రావడమేనని అన్నారు మనీషా. రెండేళ్ల పాటు కేన్సర్‌తో పోరాడానని అన్నారు . ఆ సమయంలో చాలా మంది తనని వదిలేసి వెళ్లిపోయారని, ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.

Janhvi Kapoor: కిరణ్ రావు డైరక్ట్ చేసిన లాపతా లేడీస్ సినిమాను ప్రశంసించారు జాన్వీ కపూర్. లాపతా లేడీస్ చాలా స్పెషల్ సినిమా అని, ప్రతి ఒక్కరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారని అన్నారు జాన్వీ కపూర్. సినిమా చూశాక మనసు నిండిపోయిందని అన్నారు. పెళ్లయిన తర్వాత అత్తారింటికి వెళ్లే ఇద్దరు అమ్మాయిలు దారి తప్పి ఇబ్బందులు పడ్డ కథతో తెరకెక్కింది లాపతా లేడీస్.

Kriti Sanon: సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా ఎదగడానికి ఏదో ఒక కారణం ఉంటుందని అన్నారు కృతి సనన్. తన జీవితంలో అంత గొప్ప పాత్ర పోషించిన సినిమా రాబ్తా అని చెప్పారు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, నటిగా తనకు ఎంతో నేర్పిందని అన్నారు. అందుకే ఎప్పటికీ తన మనసులో రాబ్తాకి స్పెషల్ ప్లేస్ ఉంటుందని చెప్పారు కృతి.

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందనుంది. కరువు ప్రాంతంలో ఎదిగిన వీరుడి కథగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా రష్మిక నటిస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. అక్టోబర్ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Mr. Bachchan: రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఓ భారీ మీటింగ్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు. కీలక పాత్రధారులందరూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.




