- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda to do a periodical movie next similar to Ram Charan
Vijay Devarakonda: ఆ విషయంలో రామ్‌చరణ్ ని ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ
చుట్టూ సొసైటీలో చూసే విషయాలనే స్క్రీన్ మీద ఏం చూస్తాం. కాస్త డిఫరెంట్‌గా చూపించండబ్బా అని కోరుకుంటున్నారు ఆడియన్స్. వాళ్ల టేస్ట్ ని గుర్తించారు కాబట్టే యాంబియన్స్ ని పీరియాడిక్‌కి తగ్గట్టు సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చాలా వరకు పీరియాడిక్ సెటప్‌లోపే కనిపిస్తున్నాయి. పీరియాడిక్ కాన్సెప్టులు డార్లింగ్‌కి కొత్తేం కాదు. అప్పుడెప్పుడో చేసిన బాహుబలి, రాధేశ్యామ్, ఆదిపురుష్ మాత్రమే కాదు, ఇప్పుడు సెట్స్ మీదున్న కల్కి సినిమా కూడా పీరియాడిక్ సెటపే.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: May 14, 2024 | 7:09 PM

చుట్టూ సొసైటీలో చూసే విషయాలనే స్క్రీన్ మీద ఏం చూస్తాం. కాస్త డిఫరెంట్‌గా చూపించండబ్బా అని కోరుకుంటున్నారు ఆడియన్స్. వాళ్ల టేస్ట్ ని గుర్తించారు కాబట్టే యాంబియన్స్ ని పీరియాడిక్‌కి తగ్గట్టు సెట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చాలా వరకు పీరియాడిక్ సెటప్‌లోపే కనిపిస్తున్నాయి.

శంకర్ చేసిన ఆలస్యాన్ని బుచ్చిబాబు కవర్ చేయాలంటూ రిక్వెస్టులు పంపిస్తున్నారు. ఇంతకీ గేమ్ చేంజర్ షూటింగ్ ఎంత వరకు వచ్చింది.? మొన్నామధ్య వైజాగ్‌లో చిన్న ప్యాచ్ వర్క్ ని, కొన్ని కీలక సన్నివేశాలను కంప్లీట్ చేశారు రామ్‌చరణ్.

నాని కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లో దసరా ఒకటి. నాని ఇమేజ్‌ని మార్చేసిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు నాని. అది కూడా వైవిధ్యమైన పీరియాడిక్ కాన్సెప్ట్ తోనే సాగుతుందని టాక్. ఇందులో నాని ప్రజా నాయకుడిగా కనిపిస్తారట.

తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు కోస్తా ఆంధ్రా, రాయలసీమ కుర్రాడిగా నటించేందుకు రెడీ అవుతున్నారు.

రీసెంట్‌గా ఏజెంట్ చేసిన అఖిల్ అక్కినేని నెక్స్ట్ సినిమా కూడా పీరియాడిక్ కాన్సెప్టే అని టాక్. అటు సాయి దుర్గా తేజ్ తదుపరి సినిమా 1940ల నేపథ్యంలో సాగుతుందట. ఎలాగైనా మట్కాతో హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు వరుణ్‌తేజ్. మట్కా కూడా పీరియాడిక్ కాన్సెప్ట్ తోనే సాగుతుంది.





























