AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు బంగాళదుంపలను రెగ్యులర్ గా తింటున్నారా..? అయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

ఊబకాయం, ఎసిడిటీ, మధుమేహం, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు బంగాళదుంపను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అయితే, బంగాళదుంపను తొక్క తీయకుండా వండాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బంగాళదుంప పొట్టులోని పీచు పొట్టను శుభ్రం చేస్తుంది. అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. 

మీరు బంగాళదుంపలను రెగ్యులర్ గా తింటున్నారా..? అయితే, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..
Potatoes
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2023 | 8:30 PM

Share

బంగాళదుంపలు చాలా ఇళ్లల్లో ఎక్కువగా వాడే ప్రధాన ఆహారం. బంగాళదుంపలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బంగాళదుంపలో ఫైబర్, విటమిన్ B6, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. పీచు ఎక్కువగా ఉండే బంగాళదుంపలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉండే బంగాళదుంపలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా అధిక రక్తపోటు తగ్గుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి బంగాళదుంపలు తినడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి కూడా అందుతుంది. బంగాళదుంపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారని చాలా మంది భయపడతారు. ఎందుకంటే వాటిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే మీరు రెగ్యులర్ గా హెల్తీ డైట్ ఫాలో అవుతూ, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం మానుకోవటం దాంతో పాటు మీ డైట్ లో బంగాళదుంపలను చేర్చుకుంటే..బరువు పెరిగే సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బంగాళదుంపలు కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల మీ పొట్ట త్వరగా నిండుతుంది. ఇది ఆకలిని తగ్గించడానికి, అతిగా తినడం నిరోధించడానికి సహాయపడుతుంది. బంగాళదుంపలు తినడం వల్ల శరీర ఆరోగ్యానికే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. బంగాళదుపంలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.

బంగాళదుంపలు కొవ్వు కణాలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి..ఇందులోని ప్రొటినేజ్‌ ఇన్‌హిబిటర్‌ 2 అనే ప్రొటీన్‌ ఆకలిని నియంత్రిస్తుంది. అందువల్ల బంగాళదుంపలు కొద్దిమొత్తంలో తిన్నా చాలు ఎక్కువసేపు ఆకలి కలగకుండా చూస్తుంది. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. అలాగే, ఎదిగే పిల్లలు, 30ఏళ్లు వయసు పైబడిన వారు తమ ఆహారంలో బంగాళాదుంపను తప్పక చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఊబకాయం, ఎసిడిటీ, మధుమేహం, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు బంగాళదుంపను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అయితే, బంగాళదుంపను తొక్క తీయకుండా వండాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బంగాళదుంప పొట్టులోని పీచు పొట్టను శుభ్రం చేస్తుంది. అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్  కోసం క్లిక్ చేయండి..