AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఊరినిండా బంగారు నిక్షేపాలే..! నాలుగు రాష్ట్రాల సరిహద్దులు కలిసే చోటు.. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి

పండిట్ నెహ్రూ ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా అందాలను చూసి స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారట. ఈ జిల్లాకు ఉన్న దాని సహజ సౌందర్యం, నదుల కారణంగా ఎంతో అందంగా కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా అడుగడుగునా పచ్చదనం, అందమైన పర్వతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.. ఇక్కడి నదుల ప్రవాహం కనువిందు చేస్తుంది. ఇక్కడ పవర్ ప్లాంట్లు కూడా చాలనే ఉన్నాయి.. అందుకే దీనిని పవర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు.. ఇక్కడ భారీ మొత్తంలో ఖనిజాలు లభిస్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం కూడా విస్తారంగా తవ్వుతారు.

ఈ ఊరినిండా బంగారు నిక్షేపాలే..! నాలుగు రాష్ట్రాల సరిహద్దులు కలిసే చోటు.. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి
Switzerland Of India
Jyothi Gadda
|

Updated on: Oct 31, 2023 | 5:42 PM

Share

భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో అనేక జిల్లాలు ఉన్నాయి. కానీ భౌగోళిక లక్షణాల విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రత్యేక జిల్లాను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. యూపీలోని ఈ ప్రత్యేక జిల్లా సోన్‌భద్ర గురించి చాలా తెలుసుకోవాలి..ఎందుకంటే..ప్రసిద్ధ సోన్‌భద్ర యూపీలోని రెండవ అతిపెద్ద జిల్లా. ఖనిజాలు, లవణాలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రవహించే నదులతో పాటు వింధ్య, కెమూర్ పర్వతాలు ఈ జిల్లాకు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్‌లోని రెండవ అతిపెద్ద జిల్లా సోన్‌భద్ర. నిజానికి సోనభద్ర భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన జిల్లా. ఇది ఏకకాలంలో నాలుగు రాష్ట్రాల సరిహద్దులను కలుపుతుంది. ఈ లక్షణం కారణంగా అనేక పోటీ పరీక్షలలో సోన్‌భద్ర గురించి చాలా ప్రశ్నలు అడుగుతారు.

సోన్‌భద్ర నాలుగు రాష్ట్రాల సరిహద్దులను కలుపుతుంది..

సోనభద్ర UPలోకి వస్తుంది.. కానీ, దాని సరిహద్దులు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను కూడా తాకుతుంది.. సోన్‌భద్ర మైనింగ్ పరంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ కెమూర్ హిల్స్‌లో ఖనిజాల తవ్వకం జరుగుతుంది. ఇక్కడ భారీ మొత్తంలో ఖనిజాలు లభిస్తాయి. సోన్‌భద్ర ప్రాంతంలో బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం కూడా విస్తారంగా తవ్వుతారు.

ఇవి కూడా చదవండి

1989కి ముందు సోన్‌భద్ర మీర్జాపూర్ జిల్లాలో ఉండేది. కానీ 1998 లో దీనిని వేరు చేసి సోన్‌భద్ర అని పేరు పెట్టారు. సోన్‌భద్ర అనే పేరు దాని ఒడ్డున ప్రవహించే నది నుండి వచ్చింది. సోనా నది ఈ జిల్లా ఒడ్డున ప్రవహిస్తుంది. ఈ నది పేరు మీదుగా జిల్లాను సోన్‌భద్ర అని పిలుస్తారు. ఈ జిల్లాలో కన్హర్, పంగన్‌లతో పాటు సోనా నది మాత్రమే కాకుండా రిహాండ్ నది కూడా ప్రవహిస్తుంది.

సోన్‌భద్ర జిల్లాకు పండిట్ నెహ్రూ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. సోన్‌భద్ర వింధ్య, కెమూర్ పర్వతాల మధ్య ఉంది.ఈ కారణంగా సోన్‌భద్ర జిల్లా మరింత అందాన్ని సంతరించుకుని ఉంటుంది. పండిట్ నెహ్రూ ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా అందాలను చూసి స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారట. సోన్‌భద్ర దాని సహజ సౌందర్యం, నదుల కారణంగా ఎంతో అందంగా కనిపిస్తుంది. సోన్‌భద్రలో అడుగడుగునా పచ్చదనం, అందమైన పర్వతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.. ఇక్కడి నదుల ప్రవాహం కనువిందు చేస్తుంది. ఇక్కడ పవర్ ప్లాంట్లు కూడా చాలనే ఉన్నాయి.. అందుకే దీనిని పవర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క
ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క
ఏపీకి తరగని ఆస్తి.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల జాబ్
ఏపీకి తరగని ఆస్తి.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల జాబ్
నాన్న మరణం.. గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవ..
నాన్న మరణం.. గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవ..
అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను: స్టార్ యాంకర్
అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను: స్టార్ యాంకర్
షాపులో చీరలు కొట్టేసి..మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్
షాపులో చీరలు కొట్టేసి..మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్
పెళ్లి అయినా మారని అలవాటు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో ఇదే..
పెళ్లి అయినా మారని అలవాటు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో ఇదే..
కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?
కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?
MIలో కలకలం! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గుడ్‌బై?
MIలో కలకలం! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గుడ్‌బై?
ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే..
ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే..