AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganja Cultivation: అనుమతి ఇచ్చేయండి సార్‌ ప్లీజ్‌.. గంజాయి పండించుకుంటాం ! వెరైటీ విన్నపం

Andhra Pradesh: వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి నిర్మాణానికి పటిష్టమైన చర్యలే చేపట్టింది. ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయి సాగును వాళ్లకై వాళ్లే ధ్వంసం చేసేలా గిరిజనులను అవగాహనపరిచే కార్యక్రమాల్ని ఏర్పాటు చేసింది. స్వయంగా ఆ ధ్వంస కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎక్సైజ్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా భాగస్వాములు అయ్యారు. సమూలంగా గంజాయిని నిర్మూలించే ప్రయత్నం గట్టిగానే జరిగింది. అయితే

Ganja Cultivation: అనుమతి ఇచ్చేయండి సార్‌ ప్లీజ్‌.. గంజాయి పండించుకుంటాం ! వెరైటీ విన్నపం
Jana Jagarana Samiti
Eswar Chennupalli
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 31, 2023 | 4:53 PM

Share

విశాఖపట్నం, అక్టోబర్ 31;  ఇదొక భిన్నమైన అప్పీల్. సాధారణంగా చట్టపరమైన కార్యక్రమాలు చేసేందుకు ఏమైనా అడ్డంకులు ఏర్పడుతుంటే అందుకు సహాయం చేయండి లేదా జోక్యం చేసుకోండి.. ప్లీజ్ అంటూ ప్రభుత్వాలకు వినతులు వస్తూ ఉండడం సహజమే..కానీ, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి అనుమతి ఇవ్వమంటూ కోరడం కచ్చితంగా భిన్నమైన అప్పిలే. అందులోనూ నిషేధిత గంజాయి సాగుకు అనుమతి ఇవ్వాలని జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ కోరుతుండడం పలువురిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అందులోనూ ఈ అప్పీల్ వెనక ధర్మాగ్రహం కూడా ఉందట. ఒకవైపు విచ్చలవిడిగా సాగై యువతకి అలవాటుగా మారి.. వారి జీవితాలను నిర్వీర్యం చేస్తున్న గంజాయిని నిషేధించలేకపోయారని కోపం, మరొకవైపు గంజాయి సాగు చేస్తూ ప్రస్తుతం ఆ సాగుకు దూరం చేసిన గిరిజనులకి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం చూప లేకపోవడం లాంటి అనేక రకాల ఆవేదనతో జన జాగరణ సమితి ఇలాంటి డిమాండ్ చేయాల్సి వస్తుందని, ఇది కూడా ఒక తరహా నిరసన అంటున్నారు ఆ సంస్థ నిర్వాహకులు.

రూ.40 వేలు పెట్టుబడి పెడితే రూ.4 లక్షలు వస్తుందంట..

గంజాయి సాగుకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని విశాఖలోని జనజాగరణ సమితి చేస్తున్న డిమాండ్ లో లాజిక్ ఇదేనట. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 15 వేల ఎకరాల్లో గంజాయి పంట సాగు చేస్తున్నారనీ, ఒక్కో ఎకరాకు ఏడాదికి 4 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే రూ. 40 లక్షల ఆదాయం వస్తుంది.. కాబట్టి అత్యంత ఆదాయ వనరు గల పంటగా ప్రసిద్ది చెందిందట. అందుకే ప్రపంచంలోనే రైతులకు ఊహించని విధంగా అంత క్రేజీ ఆదాయం ఇచ్చే పంట కాబట్టి..గంజాయి పండించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చి, రైతులను అప్పుల నుంచి బయటపడేయాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆపరేషన్ పరివర్తన పేరుతో ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం..

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ గంజాయి నిర్మాణానికి పటిష్టమైన చర్యలే చేపట్టింది. ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయి సాగును వాళ్లకై వాళ్లే ధ్వంసం చేసేలా గిరిజనులను అవగాహనపరిచే కార్యక్రమాల్ని ఏర్పాటు చేసింది. స్వయంగా ఆ ధ్వంస కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎక్సైజ్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా భాగస్వాములు అయ్యారు. సమూలంగా గంజాయిని నిర్మూలించే ప్రయత్నం గట్టిగానే జరిగింది. అయితే ఆ సమయంలో వాళ్లకి ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన పెంచకపోవడం, ఆ పంటల పెట్టుబడికి అవసరమైన నిధులు సమకూర్చలేకపోవడం, గతంలో క్రాప్ లోన్ పేరుతో బ్యాంకుల్లో తీసుకున్న లోన్లపై ఒత్తిడి పెరగడంతో మళ్లీ మాకు ఆదాయం వచ్చే గంజాయి పంటను సాగు చేసుకునే అనుమతి ఇవ్వాలని అక్కడక్కడ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని జన జాగరణ సమితి తాజాగా ఈ డిమాండ్ చేసిందట.

మొత్తానికి సాధారణ కార్యక్రమాలకు భిన్నంగా గంజాయి సాగుకు అనుమతి ఇవ్వాలని ఓ స్వచ్ఛంద సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరడం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..