ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. పవర్‌ఫుల్.. డైలీ నాలుగు తిన్నారంటే దెబ్బకు ఈ రోగాలన్నీ పరార్..

మన పెరట్లో దొరికే ఆకులతో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. అలాంటి వాటిలో తులసి ఒకటి.. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వాస్తవానికి, హిందూ మతంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిని లక్ష్మీ దేవి అవతారంగా భావిస్తారు.. అందుకే.. తులసి మొక్క పూజతోనే రోజును ఆరంభిస్తుంటారు.

ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. పవర్‌ఫుల్.. డైలీ నాలుగు తిన్నారంటే దెబ్బకు ఈ రోగాలన్నీ పరార్..
Benefits Of Tulsi Leaves
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 12, 2025 | 6:18 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవడం మంచిది.. అయితే.. మన పెరట్లో దొరికే ఆకులతో కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. అలాంటి వాటిలో తులసి ఒకటి.. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వాస్తవానికి, హిందూ మతంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిని లక్ష్మీ దేవి అవతారంగా భావిస్తారు.. అందుకే.. తులసి మొక్క పూజతోనే రోజును ఆరంభిస్తుంటారు. అంతేకాకుండా, ఈ మొక్క అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.. అందుకే తులసి మొక్కను ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకంగా భావిస్తారు. తులసి ఆకులు అన్ని కాలాలలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

చలికాలంలో చల్లటి గాలి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ సీజన్‌లో ప్రజలు సాధారణంగా జలుబు, దగ్గు, రోగనిరోధక శక్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తులసి ఆకులను దినచర్యలో చేర్చుకుంటే.. ఆరోగ్యానికి వరమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. తులసిలోని ఔషధ గుణాల కారణంగా భారతీయ గృహాలలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

తులసి ఆకులను రోజూ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో తులసిని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో రోజూ నాలుగు తులసి ఆకులను నమిలి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: తులసి ఆకులలో విటమిన్ సి, జింక్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తులసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చలికాలంలో జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.
  2. జలుబు – దగ్గు నుంచి ఉపశమనం: తులసిని తీసుకోవడం వల్ల కఫం, శ్లేష్మం తగ్గుతాయి. ఇందులోని యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి, దగ్గును నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. తులసిని రోజూ తింటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
  3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: తులసి ఆకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. చలికాలంలో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో తులసిని తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  4. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది: తులసిని సహజమైన యాంటీ డిప్రెసెంట్‌గా పరిగణిస్తారు. దీని ఉపయోగం చలికాలంలో సంభవించే కాలానుగుణ ప్రభావిత రుగ్మత లేదా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
  5. గుండె ఆరోగ్యానికి మంచిది: తులసిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
  6. చర్మం – జుట్టుకు మంచిది: తులసిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ వ్యాధులను నివారిస్తాయి.

తులసి ఆకులను ఎలా తీసుకోవాలి..

ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నాలుగు తాజా తులసి ఆకులను కాచి టీలా తాగండి. ఇంకా తులసిని తేనెతో కలిపి తీసుకుంటే దాని ప్రయోజనాలు పెరుగుతాయి. తులసి ఆకులను నేరుగా కూడా నమిలి తినవచ్చు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..