AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooling Water: ప్రిడ్జ్‌లో రోజుల తరబడి నిల్వ చేసిన నీరు తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా..

వేసవిలో ఎండ వేడికి దాహం ఎక్కువ వేస్తుంది. దీంతో దాహార్తిని తీర్చుకోవడానికి చల్ల చల్లని నీరు తాగాలని కోరుకుంటారు. కొంతమంది ఫ్రిజ్‌లోని నీళ్లు తాగుతారు. కొంతమంది ఒకేసారి 4 నుంచి 6 బాటిళ్ల వరకు నీటిని నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేసి.. వారాల తరబడి ప్రిడ్జ్ లో పెట్టి తాగుతారు. అయితే వారాల తరబడి ఫ్రిజ్‌లో నీటిని నిల్వ ఉంచవచ్చా? ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? తాగునీటిని ఫ్రిజ్‌లో ఎంతకాలం నిల్వ చేయవచ్చు? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Cooling Water: ప్రిడ్జ్‌లో రోజుల తరబడి నిల్వ చేసిన నీరు తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా..
Summer Health Care Tips
Surya Kala
|

Updated on: Apr 30, 2025 | 7:40 PM

Share

ఈ వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చల్లని ప్రాంతంలో ఉండాలని కోరుకుంటారు. శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారంతో పాటు ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడం సర్వసాధారణం. వేడి నుంచి ఉపశమనం కోసం చాలా మంది సాధారణ నీటికి బదులుగా రిఫ్రిజిరేటర్ లో పెట్టిన చల్లని నీటిని తాగడానికి ఇష్టపడతారు. కొంతమంది ఒకేసారి చాలా బాటిళ్లలో నీళ్లు నింపి, వారాల తరబడి ఆ వాటర్ బాటిల్స్ ను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేసుకుంటారు. గతంలో నీటిని చల్లగా ఉంచడానికి ప్రజలు మట్టి కుండలను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు కుండకు బదులుగా ఫ్రిజ్ లో పెట్టిన నీళ్లు తాగుతున్నారు. రోజూ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కొంతమంది బద్దకించి సులభంగా ఉంటుందని ఒకేసారి వారాల తరబడి నీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. త్రాగే నీటిని రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేస్తే ఏమవుతుంది? ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం..

తాగునీటిని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు: ప్రస్తుతం కొంత మంది కుండలో నీటిని నిల్వ చేసుకుని తాగడానికి ఇష్టపడితే.. మరికొందరు ప్రిడ్జ్ లో నిల్వ చేసిన నీటిని తాగడానికి ఇష్ట పడతారు. అయితే ఈ తాగునీటిని ఫ్రిజ్‌లో ఎంతసేపు నిల్వ చేయవచ్చో మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం తాగునీటిని రిఫ్రిజిరేటర్‌లో 24 గంటలు మాత్రమే ఉంచాలి. 24 గంటలకు మించి నీటిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయవద్దు. అంటే బాటిల్స్ లో నీటిని మార్చాలి.

దీని వెనుక కారణం : తాగునీటిని ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే.. ఆ నీటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందువల్ల బ్యాక్టీరియా చేరుకున్న నీటిని తాగితే ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రతి 24 గంటలకు ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టిన బాటిల్స్ నీటిని మార్చడం మంచిది. అయితే ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నిల్వ చేయకుండా ఉండటం మరింత ఆరోగ్యకరం.

ఇవి కూడా చదవండి

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కొంతమంది ఫ్రిజ్ నుంచి నీటిని తీసి వెంటనే తాగేస్తారు. అయితే ఇలా ప్రిడ్జ్ నుంచి నీటిని తీసిన వెంటనే తాగకూడదు. నీటిలోని చల్లని శాతం తగ్గిన తర్వాతే తాగాలి. అయితే వాస్తవంగా ఫ్రిజ్‌లో పెట్టిన నీటిని తాగడానికి బదులుగా మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
బీసీసీఐ అయితే ఎవరికి గొప్ప..బంగా మంత్రి తలబిరుసు మాటలు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పొలిటిక్స్ నడుస్తోందిః హరీష్ రావు
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
గురు వక్రంతో ఆ రాశుల వారి ఆదాయానికి రెక్కలు..!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
ఈ ఫోన్ 9000mAh బ్యాటరీ.. 200MP కెమెరాతో.. అప్‌గ్రేడ్‌ ఫీచర్స్‌!
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్.. ఎందుకు దొరకడో చూద్దాం
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బనానా పాన్‌కేక్స్.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ ఆప్షన్ ఇదే!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌!
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..
ఇద్దరికీ పెళ్లైంది.. అయినా గుట్టుగా ఆ యవ్వారం.. కట్ చేస్తే..
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు