AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Benefits: గ్యాస్, అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా.. ఉపశమనం కోసం ఈ యోగాసనాలు చేయండి.

గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఈ రోజుల్లో చాలా సాధారణ ఆరోగ్య సమస్యలుగా మారాయి. దీనికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు. అటువంటి పరిస్థితిలో కడుపు సంబంధిత సమస్యల నుంచి నివారణకు కొన్ని యోగా ఆసనాలు కూడా చేయవచ్చు. అవి ఏంటంటే..

Yoga Benefits: గ్యాస్, అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా.. ఉపశమనం కోసం ఈ యోగాసనాలు చేయండి.
Yoga BenefitsImage Credit source: Getty Images
Surya Kala
|

Updated on: Apr 30, 2025 | 7:11 PM

Share

నేటి బిజీ జీవనశైలిలో ప్రజలకు వ్యాయామం చేయడానికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది. అంతేకాదు బయటి ఆహారం ఎక్కువగా తినడం, చెడు జీవనశైలి కారణంగా చాలా మందికి కడుపులో గ్యాస్, ఆమ్లత్వం లేదా మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు బాధితులు రకరకాల మందులు తీసుకుంటారు. అనేక రకాల వంటింటి చిట్కాలను ట్రై చేస్తారు. అయితే ఎన్ని చేసినా కూడా ఒకొక్కసారి పెద్దగా ప్రభావం చూపించదు.

మీరు కూడా ఈ కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే క్రమం తప్పకుండా యోగా సాధన చేయవచ్చు. ఇందుకు కొన్ని ఆసనాలు ఉన్నాయి.. వీటిని సాధన చేయడం వల్ల గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం వంటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని గురించి యోగా నిపుణుల సలహా తెలుసుకుందాం.

వజ్రాసనం, నౌకాసనం, అర్ధ మత్స్యేంద్రాసనం, పవనముక్తాసనం, భుజంగాసనం ద్వారా గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని యోగా నిపుణుడు డాక్టర్ సంపూర్ణ తెలిపారు. మీరు ఈ యోగాసనాలను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా సాధన చేయాలి. కపాలభాతి, భస్త్రికా వంటి ప్రాణాయామం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నౌకాసనం: నౌకాసన చేయడానికి ముందుగా యోగా మ్యాట్ మీద మీ వీపుపై పడుకుని, మీ చేతులను మీ తొడల దగ్గర నేలపై ఉంచండి. శరీరాన్ని నిటారుగా .. వదులుగా ఉంచండి. దీని తరువాత శ్వాస తీసుకుంటూ, మీ తల, కాళ్ళు , మొత్తం శరీరాన్ని 30 నుండి 45 డిగ్రీల వరకు పైకి ఎత్తండి. శరీరాన్ని పడవ భంగిమలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. మీ పాదాల చీలమండలను మీ కళ్ళకు అనుగుణంగా తీసుకురండి. ఈ V- ఆకారపు ఆకారంలో దాదాపు 20 నుంచి 30 సెకన్లు ఉండండి. నెమ్మదిగా గాలి వదిలి మీ సాధారణ స్థితికి తిరిగి చేరుకోండి.

అర్ధ మత్స్యేంద్రాసనం: అర్ధ మత్స్యేంద్రాసనము చేయడానికి ముందుగా యోగా మ్యాట్ మీద కూర్చోండి. దీని తరువాత కుడి కాలును వంచి, ఎడమ కాలు కింద ఉంచండి. దీని తరువాత ఎడమ కాలును వంచి కుడి కాలు వైపు ఉంచండి. కుడి చేతితో ఎడమ కాలు మోకాలిని పట్టుకుని, ఎడమ చేతిని వెనుకకు ఉంచాలి. మీ మెడను మీ ఎడమ భుజం వైపుకు వంచండి. ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండి, ఆపై మరొక వైపు పునరావృతం చేయండి.

వజ్రాసనము: వజ్రాసనం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిని చేయడానికి యోగా మ్యాట్ మీద మోకాళ్లపై కూర్చోండి. దీని తరువాత రెండు పాదాల బొటనవేళ్లను కలిపి, మడమలు పిరుదుల బయటి భాగాన్ని తాకే విధంగా కూర్చోవాలి. మెడ, వీపు, తలను నిటారుగా ఉంచండి. ఇప్పుడు మీ రెండు చేతులను మోకాళ్లపై ఉంచండి. సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి. దీని తరువాత నెమ్మదిగా గాలి పీల్చుకుని, వదలండి. మొదట్లో ఈ స్థితిలో 15 నుంచి 20 నిమిషాలు కూర్చుని, క్రమంగా సమయాన్ని పెంచుకోండి.

పవన్ముక్తాసనం: పవనముక్తసనం జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ యోగాసనం చేయడానికి యోగా మ్యాట్‌పై నేరుగా పడుకోండి. దీని తరువాత, శ్వాస తీసుకుంటూ కాళ్ళను 90 డిగ్రీల వరకు పెంచండి. ఇప్పుడు గాలి వదులుతూ మీ కాళ్ళను వంచండి. మీ మోకాళ్ళను మీ ఛాతీ వరకు తీసుకురావడానికి ప్రయత్నించండి. దీని తరువాత అరచేతితో మోకాళ్ళను పట్టుకోండి. దీని తరువాత మీ తల పైకెత్తి, మీ నుదిటిని మీ మోకాళ్లకు తాకండి. ఇప్పుడు సాధారణంగా శ్వాస తీసుకోండి. ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉన్న తర్వాత, మొదట తలను, తరువాత పాదాలను నేలపై ఉంచి తిరిగి మొదటి స్థానానికి వెళ్ళండి.

భుజంగాసనము: భుజంగాసనం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉండటమే కాదు కడుపు కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఆసనం వేయడానికి యోగా మ్యాట్ బోర్లా పడుకొని రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి నేలమీద ఆనించాలి. రెండు చేతులను ఛాతీకి దగ్గరగా నేలమీద ఉంచాలి. కొద్దిగా శ్వాస పీల్చి, తలపైకి ఎత్తి నడుమును వెనుకకు వీలైనంత వరకు వంచాలి.. ఆకాశం వైపు చూస్తున్నట్లుగా మీ మెడను వెనక్కి వంచండి. ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండి, ఆపై నెమ్మదిగా మునుపటి స్థానానికి తిరిగి రండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)