Viral Video: మీరు టీ ప్రియులా.. ఎప్పుడైనా కొబ్బరి నీళ్లతో టీ తయారీ.. వీడియో వైరల్
కరోనా తర్వాత సోషల్ మీడియాలో రకరకాల ఆహారాలకు సంబందించిన వీడియోలో ప్రత్యక్షం అయ్యాయి. గులాబ్ దోస, ఓరియో పకోడా, చాక్లెట్ మ్యాగీ, చాక్లెట్ మోమోస్ వంటి అనేక వింత ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ వీడియోలు చూసి నెటిజన్ల ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే ఒక వీడియో వైరల్ అయింది. అందులో ఒక మహిళ కొబ్బరి నీళ్లతో వేడి వేడిగా టీ తయారు చేస్తోంది. ఇది చూసిన తర్వాత నెటిజన్లు ముందు ముందు ఇంకేం వంటలు చేస్తారో అంటూ కామెంట్ చేస్తున్నారు.

టీ అంటే చాలా మందికి చాలా ఇష్టం. చాలా మంది ఉదయం నిద్రలేచి పళ్ళు తోముకున్న వెంటనే చేసే మొదటి పని టీ తాగడం. ముఖ్యంగా టీ ప్రియులు ఎన్ని కప్పుల టీ కావాలంటే అన్ని కప్పులు తాగుతారు. ఇక ఈ టీలో కూడా బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ, స్పైస్డ్ టీ వంటి వివిధ రకాల టీలు ఉన్నాయి. చివరకు పచ్చి మిర్చి టీ కూడా ఉంది. అయితే మీరు ఎప్పుడైనా కొబ్బరి నీళ్ల టీ తాగారా? ఒక మహిళ కొబ్బరి నీళ్లతో టీ తయారు చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అవును ఆమె నీళ్లకు బదులుగా కొబ్బరి నీళ్లతో టీ తయారు చేసింది. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆమె ఇంకా ఏమి చేస్తుందో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
కొబ్బరి నీళ్లతో వేడి టీ తయారు చేస్తున్న స్త్రీ:
సాధారణంగా నీరు, పాలు, తేయాకు కలిపి టీ తయారు చేస్తారు. అయితే ఈ వైరల్ వీడియోలో ఒక మహిళ నీటికి బదులుగా కొబ్బరి నీళ్ళు ఉపయోగించి వేడి టీ తయారు చేసింది. ఈ వీడియో _hetals_art_ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ గ్యాస్ స్టవ్ మీద కొబ్బరి బొండాన్ని పెట్టింది. దానిలో కొబ్బరి నీళ్లు ఉన్నాయి. దీనిలో టీ పొడి, చక్కెర, పాలు కలిపి వేడి టీ తయారు చేసినట్లు చూడవచ్చు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి :
View this post on Instagram
ఏప్రిల్ 2న షేర్ చేయబడిన ఈ వీడియోకు 2.5 లక్షల వ్యూస్ తో పాటు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మా మనో భావోద్వేగాలతో ఇలా ఎందుకు ఆడుకుంటారు?” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. మరొక వినియోగదారుడు, “ఇది చాలా పిచ్చిగా ఉంది” అని కామెంట్ చేశాడు. “ఇదీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి” అని మరొకరు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




