Success Story: పకోడీ అమ్మే తమ తండ్రిని గెలిపించిన పిల్లలు.. ఒకరు ఐఏఎస్, ముగ్గురు డాక్టర్లు..
తల్లిదండ్రులు పిల్లలను పెంచే విషయంపై రకరకాల అభిప్రాయాలున్నాయి. తాము పడే కష్టం తెలియకుండా తమ పిల్లలు పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే తల్లిదండ్రులు తమని పెంచడం కోసం పడుతున్న కష్టాన్ని చూసి కొంత మంది పిల్లలు చదువు తమకి భవిష్యత్ ఇస్తుందని.. భావిస్తారు. చదువుకోవడానికి పుస్తకాలూ లేకపోయినా, ఇంట్లో విద్యుత్ సదుపాయం లేకున్నా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మంచి మంచి చదువులు చదువుతారు. IAS, IPS ఆఫీసర్లతో పాటు డాక్టర్లు వంటి ఉన్నత విద్యనభ్యసిస్తుంటారు. ఈ రోజు పేదరికంతో పోరాడుతూ.. పకోడీ అమ్ముతూ తమని పెంచిన తండ్రిని గెలిపించిన పిల్లలు గురించి తెలుసుకుందాం.. ఆ పిల్లలో ఒకరు ఐఏఎస్, ముగ్గురు డాక్టర్లు..

రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ ని అటల్ బంద్ ఏరియాకి చెందిన గోవింద్ కుమార్ రోడ్డుపై తోపుడుబండి పెట్టుకుని పకోడీ వంటి చిరుతిళ్లు అమ్మేవాడు. గోవింద్ కుమార్ తన భార్య , నలుగురు పిల్లలని పోషించడానికి ఎండనక వాననక కష్ట పడ్డాడు. తండ్రి కష్టం చూస్తూ పెరిగిన ఈ పకోడీవాలా కూతురే జార్ఖండ్ కేడర్ ఐఎఎస్ ఆఫీసర్ దీపేష్ కుమారి.
దీపేష్ కుమారి తండ్రి తన కుటుంబాన్ని పోషించడానికి 25 సంవత్సరాలుగా వీధిలో పకోడీలు, స్నాక్స్ అమ్మేవాడు. ఆరుగుఋ సభ్యుల కుటుంబం.. పరిమిత వనరులతో ఒకే చిన్న గదిలో నివసించింది. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. తండ్రి తన పిల్లల చదువుకి ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చాడు. తండ్రి కష్టం చూస్తూ పెరిగిన దీపేష్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివారు. ఆమె భరత్‌పూర్‌లోని శిశు ఆదర్శ్ విద్యా మందిర్‌లో చదివి 10వ తరగతిలో 98%, 12వ తరగతిలో 89% తో ఉత్తీర్ణత సాధించారు. తర్వాత జోధ్‌పూర్‌లోని MBM ఇంజనీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో B.Tech, IIT బాంబే నుంచి M.Tech పట్టా పొందారు. తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి సాలరీతో ఉద్యోగంలో చేరారు
ఒక సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత జాబ్ వదిలేసిన దీపేష్ సివిల్ సర్వెంట్ కావాలనే తన కలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. UPSC పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించారు. 2020లో ఆమె మొదటి ప్రయత్నం విఫలం కాగా.. దీపేష్ నిరాస పడలేదు. మళ్ళీ తాను పొదుపుగా దాచుకున్న డబ్బుని ఉపయోగించి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లి మళ్ళీ UPSC పరీక్షకు సిద్ధం అయ్యారు.
2021లో దీపేష్ కృషికి ఫలితం దక్కింది. దీపేష్ UPSC పరీక్షలో అఖిల భారత స్థాయిలో 93వ ర్యాంక్ సాధించి, EWS (ఆర్థికంగా వెనబడిన తరగతులు)విభాగంలో 4వ ర్యాంక్‌ను కూడా సాధించింది. ఆమె IAS అధికారిణిగా చేరి జార్ఖండ్ కేడర్‌కు నియమించబడింది. ఐఏఎస్ ఆఫీసర్ గా దీపేష్ కుమారి ను జార్ఖండ్ కి వెళ్ళారు. జార్ఖండ్ రోడ్డు రవాణా, హైవేస్ విభాగానికి అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ఆఫీసర్ గా ప్రజల్ల్లో పేరుగాంచారు.
తండ్రి కష్టం, దీపేష్ విజయం చూస్తూ పెరిగిన ఆమె తోబుట్టువులు కూడా ఏదైనా సాధించాలనే స్ఫూర్తి కలిగింది. దీపేష్ చెల్లెలు ఇప్పుడు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులను నిర్వహిస్తుండగా.. ఒక సోదరుడు గౌహతిలోని ఎయిమ్స్‌లో ఎంబిబిఎస్ చదువుతున్నాడు, మరొక సోదరుడు లాతూర్‌లో ఎంబిబిఎస్ చదువు కొనసాగిస్తున్నాడు.
దీపక్ ఐఏఎస్ ఆఫీసర్ గా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. తన తండ్రి అంకితభావమే తనకు అతిపెద్ద ప్రేరణ అని చెప్పారు. తాను అలసిపోయినప్పుడల్లా.. తండ్రి పోరాటం తనకు బలాన్నిచ్చింది” అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే పరిస్థితులతో పనిలేదని.. కృషి పట్టుదల అంకిత భావం ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చు అని నేటి యువతకు ప్రేరణగా దీపేష్ తో పాటు తోబుట్టువులు ప్రేరణగా నిలుస్తున్నారు.
మరిన్ని సోషల్ మీడియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




