వ్యాయమం చేసేటప్పుడు మాస్క్ వేసుకుంటున్నారా ? అధ్యాయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..

కరోనా ప్రభావం ప్రతి క్షణం మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాస్క్ మన జీవన శైలీలో ఒక భాగంగా మారిపోయింది. ఎటూ వెళ్ళిన మాస్క్

వ్యాయమం చేసేటప్పుడు మాస్క్ వేసుకుంటున్నారా ? అధ్యాయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 09, 2021 | 12:59 PM

కరోనా ప్రభావం ప్రతి క్షణం మాస్క్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాస్క్ మన జీవన శైలీలో ఒక భాగంగా మారిపోయింది. ఎటూ వెళ్ళిన మాస్క్ ధరించాల్సిందే. అయితే వ్యాయమం చేసేటప్పుడు కూడా కొంత మంది మాస్క్ ధరిస్తుంటారు. అయితే అలా ధరించడం వలన ఆరోగ్యకరమని పరిశోధనలో వెల్లడైంది.

ఇంట్లోనే వర్క్ అవుట్స్ చేసేవారిలో కోవిడ్ ప్రభావం తక్కువగా ఉన్నట్లు తెలిపింది. యూరోపియన్ రెస్పిరేటర్ జర్నల్ ప్రచురించిన.. ఈ అద్యాయనం ప్రకారం మాస్క్ లేకుండా వ్యాయం చేస్తున్న వారిలో శ్వాస, గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది. మాస్క్ ధరించడం.. మాస్క్ ధరించకపోవడం మధ్య ఎలాంటి చిన్న చిన్న తారతామ్యాలు మాత్రమే గుర్తించామని.. వీటివలన ఎలాంటి ప్రాణహాని లేదని తెలిపింది. ఇటలీలోని సెంట్రో కార్డియోలాజికో మోన్జినో, ఐఆర్‌సిసిఎస్, మిలన్, డాక్టర్ మాసిమో… సెంట్రో కార్డియోలాజికో మొంజి… యూనివర్సిటీ ప్రొఫెసర్ పియర్గియుసేన్ అగోస్టోనితో కలిసిన బృందం వీటిపై అధ్యాయనం వెల్లడించింది.

మాస్క్ ధరించడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించవచ్చని.. అయితే తీవ్రమైన వ్యాయమం చేసేప్పుడు మాస్కులు ధరించవచ్చ లేదా అనేది స్పషంగా తెలియరాలేదు. 40 సంవత్సరాల వయసున్న వారు మాస్క్ ధరించే వ్యాయమం చేయడం వలన వారు ఆరోగ్యకరంగా ఉన్నట్లుగా తెలిపారు. అలాగే శ్వాస, గుండె స్పందన రేటు, రక్తపోటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు నిలకడగా ఉన్నట్లుగా తెలిపారు. మాస్క్ వేసుకోవడం వలన కేవలం చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయని తెలిపారు. ఏరోబిక్ వ్యాయమం చేయగల వారి సామర్థ్యంలో సగటున పది శాతం తగ్గిస్తుందని వెల్లడైంది. ఇందుకు కారణం మాస్కులు ధరించడంవలన ఉపిరి పీల్చుకోవడం కష్టంకావడమేనని తెలిపారు. ఆరోగ్యకరమైన వ్యక్తులలో గుండె లేదా ఉపరితిత్తులు స్థితి.. మెట్లు ఎక్కడం లేదా ఇంటి పని చేయడం వంటి రోజూవారీ కార్యకలాపాలను చేస్తున్నప్పుడు మాస్క్ ధరిచడంపై ఈ అద్యాయనం జరిగింది.

Also Read:

సమ్మర్ వచ్చేసింది.. కొంచెం జాగ్రత్త పడితే మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు.. అది ఎలాగో తెలుసా…

Dates benefits: ఖాళీ కడుపుతో కర్జురాలను తింటున్నారా ? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..