AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్ వచ్చేసింది.. కొంచెం జాగ్రత్త పడితే మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు.. అది ఎలాగో తెలుసా…

వేసవి కాలం ప్రారంభమవుతుంది. ఇప్పటికే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఈ వేసవి తాపాన్ని తట్టుకొవడానికి ప్రతి ఒక్కరు సిద్ధమవ్వాల్సిందే.

సమ్మర్ వచ్చేసింది.. కొంచెం జాగ్రత్త పడితే మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు.. అది ఎలాగో తెలుసా...
Rajitha Chanti
|

Updated on: Mar 09, 2021 | 7:07 AM

Share

వేసవి కాలం ప్రారంభమవుతుంది. ఇప్పటికే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఈ వేసవి తాపాన్ని తట్టుకొవడానికి ప్రతి ఒక్కరు సిద్ధమవ్వాల్సిందే. అందుకు తగిన దుస్తులు, జువెల్లరీ వాడుతుంటారు. మరీ మీరు వార్డ్ బోర్డులో వేసవికి సంబంధించిన దుస్తులు, వస్తువులు ఉన్నాయా ? సమ్మర్ లో మరింత అందంగా కనిపించడమే కాకుండా.. చర్మాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన వస్తువులెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హ్యాండ్ బ్యాగులు..

లేత రంగు బ్యాగులు, స్లింగ్ బ్యాగులు, అలాగే హ్యాండ్ బ్యాగులు ఎప్పటికీ పాతవి కావు. ఇవి మీ వేసవి కాలానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చు. ఈ సమ్మర్లో డార్క్ కలర్స్ కాకుండా.. లేత రంగు హ్యాండ్ బ్యాగులను మాత్రమే ఎంచుకోవడం మంచిది. అలాగే దుస్తులకు తగినట్టుగా లేత రంగులను ఈ వేసవిలో ఎంచుకోవడం ఉత్తమం.

2. సన్ గ్లాసెస్..

సన్ గ్లాసెస్ మీ అందాన్ని మరింత పెంచెందుకు తోడ్పడతాయి. పెద్ద కళ్ళజోడులను ఎంచుకోవడంతోపాటు రంగు రంగుల సన్ గ్లాసెస్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ధరించబోయే దుస్తులను బట్టి మరియు మీరు ఏ సందర్బం కోసం దుస్తులను ధరించడమనే దానిపై ఆధారపడి ఉంటాయి. సన్ గ్లాసెస్ విస్తృత శ్రేణిని కలిగి ఉంటాయి. అలాగే విభిన్న రకాల సన్ గ్లాసెస్ వాడడం ఉత్తమం.

3. స్కార్ఫ్స్..

మార్కెట్లో రకాల రకాల రంగులతోపాటు, ప్రింట్లతో కూడిన బందనాస్ అందుబాటులో ఉన్నాయి. వాటిని తలపై కట్టడంతోపాటు.. జుట్టుకు కూడా అందంగా కట్టవచ్చు. ఇవి సూర్య రశ్మి నుంచి మిమ్మల్ని కాపాడతాయి. అంతేకాకుండా మిమ్మల్ని మరింత ఫ్యాషన్ గా కనబడేలా చేస్తాయి. బందనాస్ లను మేడ చుట్టూ కట్టడం వలన మీరు ధరించే దుస్తులకు మరింత అందాన్నిస్తాయి.

4.నెక్లెస్ & బ్రేస్ లైట్స్..

బిట్సీ పెండెంట్స్… పొరలుగా ఉన్నటువంటి గొలుసులు.. లేయర్స్ ఆభరణాలు మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. సమ్మర్ లో ఈ నెక్లెస్ లేదా ట్యూబ్ టాప్స్ ఉన్న దుస్తులను ధరించడమే మరింత అందంగా కనిపిస్తారు. ఈ వేసవికాలంలో లేయర్డ్ నెక్లెస్ ధరించడం ఉత్తమం. పూసలతో కలిగిన బ్రేస్ లైట్స్.. దుస్తులకు తగిన సాధారణ బంగారు నగలను ఎంచుకోవచ్చు.

5. టోపీలు..

మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం మార్కెట్లో బకెట్ టోపీలు విరివిరిగా లభిస్తున్నాయి. ఇవి సూర్య రశ్మీ నుంచి మిమ్మల్ని కాపాడడమేకాకుండా మీరు మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. అలాగే ఇందులో బ్లాక్, వైట్, లేత గోధుమ రంగులను ఎంచుకోవడం బెటర్. ఈ సమ్మర్ లో ఇవి ధరించడం వలన మీరు మీ చర్మాన్ని కాపాడుకోవడం సహయపడతాయి ఇవి.

Also Read:

మోచేతులు నల్లగా ఉన్నాయని ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ సులభమైన చిట్కాలను ట్రై చేసేయ్యండి..