AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sitting on The Floor : ధ్యానం, యోగా, పూజ ఇలా ఏ సందర్భంలో నైనా భూమి మీద నేరుగా కూర్చోవద్దు అనేది పెద్దల మాట ఎందుకో తెలుసా..!

హిందూ సంప్రదాయంలో మనస్సు ప్రశాంతంగా, శరీరం రిలాక్స్ అయ్యే విధంగా చేసేది యోగా. ఇది మన జీవన విధానంలో అద్భుతమైంది. ఒత్తిడిని నివారించి.. మనసును శాంతపరుస్తుంది. అయితే అనేక రకాల ఆసనాలు .. వేర్వేరు ప్రయోజనాలను..

Sitting on The Floor : ధ్యానం, యోగా, పూజ ఇలా ఏ సందర్భంలో నైనా భూమి మీద నేరుగా కూర్చోవద్దు అనేది పెద్దల మాట ఎందుకో తెలుసా..!
Surya Kala
|

Updated on: Mar 09, 2021 | 12:37 PM

Share

Sitting on The Floor : హిందూ సంప్రదాయంలో మనస్సు ప్రశాంతంగా, శరీరం రిలాక్స్ అయ్యే విధంగా చేసేది యోగా. ఇది మన జీవన విధానంలో అద్భుతమైంది. ఒత్తిడిని నివారించి.. మనసును శాంతపరుస్తుంది. అయితే అనేక రకాల ఆసనాలు .. వేర్వేరు ప్రయోజనాలను ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరచడమే కాదు.. రోగనిరోధక శక్తిని పెంపొందించి.. రక్త ప్రసరణను అభివృద్ధి చేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది యోగా.. అయితే మనం కూర్చునే సమయంలోనే కాదు.. యోగాసనాలు వేయు సమయంలో కూడా కటిక నేల మీద కూర్చోకూడదు అని పెద్దలు చెబుతారు.

కూర్చోవడానికి కుర్చీ, పీట, ఇదొక వస్త్రంతో చేసిన ఆసనం లేకపోతె దర్భాసనం, జింక చర్మం తో చేసిన ఆసనం ఏదోకటి భూమి మీద వేసుకుని కూర్చోవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఇలా ఎందుకు చేయాలో కూడా ఓ రీజన్ చెబుతుంది. మనిషి శరీరంలో ఎల్లప్పుడూ విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక అది ఉత్పత్తి అయ్యి బాటకు వెళ్తూ ఉంటుంది. అయితే ఈ విద్యుత్ ఉత్పత్తి అయ్యేది.. బయటకు వెళ్ళేది సమానంగా ఉండాలి అంటారు. అలా కాకుండా రెండు వేర్వేరుగా ఉంటె శారీరక సమస్యలు ఏర్పడతాయని అంటారు.

అదే మనిషి ఆసనం మీద కూర్చుంటే శరీర ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. ఇక అలా కాకుండా నెల మీద మీ లేకుండా అలా కూర్చుంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎక్కువ శాతం బయటకు వెళ్ళిపోతుంది. కనుక ఎప్పుడూ భూమి మీద డైరెక్ట్ గా కూర్చోకూడదు. పూజ చేసినప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, యోగాసనాలు వేయు సమయంలో, అన్నం తినే సమయంలో ఇలా ఏ సందర్భంలో నైనా కటిక నేల మీద కూర్చో కూడదు. ఆసనం వేసుకుని కూర్చోవాలి అని పెద్దలు సూచించారు. కనుక ఇప్పటి నుంచైనా మీరు పెద్దలు చెప్పినవి చాదస్తం అనుకోకుండా.. కటిక నేల మీద కూర్చోకుండా ఏదైనా ఆసనం వేసుకుని కూర్చోవాలని యోగా నిపుణులు చెబుతున్నారు.

Also Read:

‘సామజవరగమన’ గాయకుడు సిద్ శ్రీరామ్‏కు అవమానం.. ఒంటిపై మద్యం, వాటర్ పోసి..

కర్ణాటకలో దారుణం.. అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికిచంపిన భర్త.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..