Natural Wart Removal Tips: మిమ్మల్ని పులిపిర్లు ఇబ్బంది పెడుతున్నాయా..! సహజ పద్ధతుల్లో ఇలా తగ్గించుకోవచ్చు
పులిపిర్లు మన శరీరంపై సహజంగా ఏర్పడతాయి. వీటి వల్ల పెద్దగా నొప్పి లేకపోయినా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అయితే ఈ పులిపిర్లు ఎక్కువగా కాళ్ళు చేతులు, ముఖం పైన కనిపిస్తాయి ...
Natural Wart Removal Tips: పులిపిర్లు మన శరీరంపై సహజంగా ఏర్పడతాయి. వీటి వల్ల పెద్దగా నొప్పి లేకపోయినా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అయితే ఈ పులిపిర్లు ఎక్కువగా కాళ్ళు చేతులు, ముఖం పైన కనిపిస్తాయి. ఈ పులిపిర్లు హ్యూమస్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతాయి. అందుకనే వీటిని గోళ్లతో గిల్లకూడదు. అయితే కొంతమంది వీటిని కత్తిరించడం, కాల్చడం వంటివి చేస్తుంటారు.,. అలా చేయడంతో ఇన్ఫెక్షన్ ఏర్పడవచ్చు. మళ్ళీ పులిపిర్లు రావచ్చు. అయితే వీటిని మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో సహజ పద్దతులతో తగ్గించుకోవచ్చు.. అవి ఏమిటో తెలుసుకుందాం..!
* వెల్లుల్లి రేఖలను దంచి పులిపిరిపై రుద్దాలి.. ఇలా రెండు మూడు వారాల పాటు చేస్తే.. పులిపిర్లు తగ్గుతాయి. *ఉల్లిపాయ సగానికి కోసి.. అందులో రాళ్ల ఉప్పుతో నింపి.. పూర్తిగా రాళ్లు కరిగి ఓ ద్రవ పదార్ధం తయారవుతుంది. ఈ రసాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుని ఒక నెలరోజుల పాటు రోజు పులిపిర్లు మీద ఆ రసాన్ని దూదితో అడ్డుకోవాలి.. ఇలా క్రమం తప్పకుండా 30 రోజులు చేస్తే పులిపిర్లు తగ్గుతాయి. * నారింజ తొక్క కూడా పులిపిర్లను తగ్గించే సహజ నివారిణి. రోజుకు ఒకసారి నారింజ పై తొక్కను పులిపిర్లపై రుద్దాలి. ఇలా చేయడంతో మొదట్లో పులిపిరి రంగు మారుతుంది. తర్వాత క్రమంగా రాలిపోతుంది. ఇలా జరగడానికి రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. * ఒక స్పూన్ కొబ్బరి నూనె ను తీసుకుని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా మరియు ఒక కర్పూరం బిళ్లల తీసుకుని మూడింటిని కలిపి ఒక క్రీమ్ తయారు చేసుకుని తర్వాత పులిపిర్లు పై అప్లై చేయాలి .. ఇలా రోజు రెండు రోజులు అప్లై చేయాలి .. అలా చేస్తే చేస్తే మూడు నాలుగు వారాల్లో పులిపిర్లు రాలిపోతాయి. * రాత్రి సమయంలో పులిపిరిపై అరటి తొక్కచిన్న ముక్క ను ఉంచి.. అది పడిపోకుండాప్లాస్టర్ వేయాలి.. పులిపిరి పోయేవరకూ ఇలా రోజూ చేయాలి . * ఆముదం కూడా పులిపిర్లు తగ్గించడానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా పులిపిర్లు తగ్గే వరకూ చేయాల్సి ఉంది. * కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అయితే ఈ సున్నం రాసుకునే సమయంలో చుట్టుపక్కల ప్రాంతానికి తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే సున్నం తలిగిన ప్రాంతంలో బొబ్బలు వస్తాయి. * రాతి ఉసిరికాయను గుజ్జుగా నూరి ఆ ముద్దను పులిపిర్లపై అప్లై చేయాలి ఇలా నెలరోజుల పాటు చేస్తే అవి రాలిపోతాయి.
Also Read: