Village Talent: ఏం టాలెంట్ సామీ.. ఆమెలా మరెవరూ చేయలేరంటే నమ్మొచ్చు.. ఐపీసీ ఆఫీసర్ ట్వీట్.. నెటిజన్లు ఫిదా..!
Village Talent: భారతదేశంలో ’పిడకలు‘ తెలియని వారు ఉండరు. పశువుల పేడను ముద్దలుగా చేసి వాటిని గోడకు ఒక ఆకారంలో కొడతారు. అలా అవి ఎండిన తరువాత

Village Talent: భారతదేశంలో ’పిడకలు‘ తెలియని వారు ఉండరు. పశువుల పేడను ముద్దలుగా చేసి వాటిని గోడకు ఒక ఆకారంలో కొడతారు. అలా అవి ఎండిన తరువాత తీసి వంట చెఱుకుగా, ఇతర అవసరాలకు వినియోగిస్తారు. ప్రస్తుతం పిడకల అమ్మకాలు కూడా సాగుతున్నాయి. వాటికి ప్రపంచ మార్కెట్లలో డిమాండ్ కూడా ఉంది. ఇటీవలి కాలంలో అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలోనూ పిడకల అమ్మకాలు కనిపించాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాజాగా ఓ మహిళ ఎత్తైన గోడకు పిడకలు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కాబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఒక ప్రొఫెషనల్‌గా పని పూర్తి చేసేశారు’. అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.
ఈ వీడియోలో మహిళ పేద ముద్దలను ఎత్తైన గోడకు పిడకలుగా కొడుతోంది. తనకు అందకపోయినప్పటికీ.. గురిచూసి గోడకు పేడ ముద్దలను విసురుతోంది. పైగా ఒక వరుస ప్రకారం, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా స్పీడ్‌గా కొట్టేసింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఇండియన్ బాస్కెట్ బాల్ టీమ్ ఇప్పటికీ ఈ మహిళ కోసం ఎదురుచూస్తోంది’ అంటూ వీడియోకు కామెంట్ చేశారు. మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక వీడియోను 53,000 మంది చూడగా.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘ఆమె ఇంత ఫర్ఫెక్ట్ చేస్తుందంటే చాలా అనుభవం ఉండే ఉంటుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఇంత ఫర్ఫెక్ట్‌గా, గురి తప్పకుండా, ఒకే క్రమంలో పిడకలు కొట్టడం అంత సులభం కాదు. చాలా టాలెంట్ ఉండాలి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఇది గ్రామీణ భారతదేశంలో ఒక సాధారణ ప్రతిభ. మేం దీన్ని ప్రత్యక్షంగా చూశాం. భారతదేశంలో మాత్రమే ఇది సాధ్యం’ అని ఇంకొకరు స్పందించారు.
IPS Officer Tweet:
Done it like a pro…?? pic.twitter.com/l2aNWvmqwR
— Dipanshu Kabra (@ipskabra) March 3, 2021
Also read:
Maitri Setu Bridge: ‘మైత్రి సేతు’ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. భారత్ – బంగ్లాల మధ్య అతిపెద్ద వంతెన
