Maitri Setu Bridge: ‘మైత్రి సేతు’ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. భారత్ – బంగ్లాల మధ్య అతిపెద్ద వంతెన

PM Modi inaugurates Maitri Setu bridge: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య నిర్మించిన మైత్రి సేతు వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం..

Maitri Setu Bridge: ‘మైత్రి సేతు’ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. భారత్ - బంగ్లాల మధ్య అతిపెద్ద వంతెన
PM Narendra Modi inaugurates Maitri Setu bridge
Follow us

|

Updated on: Mar 09, 2021 | 3:30 PM

PM Modi inaugurates Maitri Setu bridge: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య నిర్మించిన మైత్రి సేతు వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. భారత్‌తో ముఖ్యంగా ఈశాన్య భారతాన్ని కలుపుతున్న ఈ వంతెన ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉందనేందుకు ప్రతీక అని ఆ దేశ ప్రధానమంత్రి షేక్‌ హసీనా పేర్కొన్నారు. త్రిపురలో భారత సరిహద్దు, బంగ్లాదేశ్‌ల మధ్య ప్రవహించే ఫెని నదిపై మైత్రి సేతు వంతెననను నిర్మించారు. 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన భారత్‌లోని సబ్‌రూంను బంగ్లాదేశ్‌లోని రామ్‌గఢ్‌తో అనుసంధానం చేస్తుంది. రూ. 133 కోట్ల అంచనా వ్యయంతో ఈ బ్రిడ్జిని నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిర్మించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ సబ్​రూమ్‌లో ఇంటిగ్రేటెడ్ చెక్​పోస్టు సహా 208 నెంబర్ జాతీయ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతోపాటు ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన 40,978 ఇళ్లను, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్​మోదీ ప్రారంథభించారు. త్రిపురలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలియజేశారు.

ఒకప్పుడు విద్యుత్‌ ఇబ్బందులు ఎదుర్కొన్న త్రిపుర.. ప్రస్తుతం విద్యుత్‌లో మిగులు రాష్ట్రంగా అవతరించిందని మోదీ పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పోరాడే పెద్ద రాష్ట్రాలు కూడా అభివృద్ధి దిశగా పునరాలోచనలో పడ్డాయని ప్రధాని గుర్తుచేశారు. కొన్నేండ్లుగా సమ్మెలు, ఆందోళన సంస్కృతిలో మగ్గిన త్రిపుర ఇప్పుడు సులభతర వాణిజ్యం దిశగా అడుగులేస్తుందని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిపుర గవర్నర్ రమేష్ బైస్, సీఎం బిప్లబ్ కుమార్ దేబ్, మంత్రులు, ఎంపీలు, తదితరులు పాల్గొన్నారు.

Also Read:

Drugs Seized : లక్ష ద్వీప్ : భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. ఆరుగురు శ్రీలంక దేశీయుల అరెస్ట్.. డ్రగ్స్‌ విలువ ఎంతో తెలుసా..?

రాజీనామా బాటలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ? కొత్త సీఎం ఎవరు ?

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ