AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crystal Clear River : ఆ నది అడుగు భాగంలో రాళ్లు, చేపలను కూడా స్పష్టంగా చూడొచ్చు.. అంత స్వచ్ఛమైన నది ఎక్కడుందంటే..!

భారత దేశం ఆధ్యాత్మక ప్రదేశాలకు, దేవాలయాలకు కాదు.. ప్రకృతి సంపదకు కూడా నిలయం. ఆ సేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకూ మనసును రంజిపజేసే ప్రకృతి సోయాగాలు అందరిని ఆకర్షిస్తాయి. అయితే మారుతున్న కాలంతో పాటు..

Crystal Clear River : ఆ నది అడుగు భాగంలో రాళ్లు, చేపలను కూడా స్పష్టంగా చూడొచ్చు.. అంత స్వచ్ఛమైన నది ఎక్కడుందంటే..!
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2021 | 1:50 PM

Crystal Clear River : భారత దేశం ఆధ్యాత్మక ప్రదేశాలకు, దేవాలయాలకు కాదు.. ప్రకృతి సంపదకు కూడా నిలయం. ఆ సేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకూ మనసును రంజిపజేసే ప్రకృతి సోయాగాలు అందరిని ఆకర్షిస్తాయి. అయితే మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానం కూడా ప్రకృతి సంపదనను నాశనం చేస్తుంది. నదులను దేవతలుగా పూజించే పుణ్య భూమిలో అవి కాలుష్య కారకులుగా మారిపోయాయి. పారిశ్రామిక వ్యర్ధాలతో పాటు.. మనిషి నిర్లక్ష్యం నీడల్లో గంగా నది నుంచి గోదావరి వరకూ అన్ని నదులు కాలుష్యాన్ని నింపుకుని తమ స్వచ్ఛతనుఁ కోల్పోయాయి.

దీంతో ఎన్నో సుందర ప్రదేశాలు తమ శోభను కోల్పోతున్నాయి. పర్యాటకులు ఆ ప్రాంతాలకు వెళ్లాలంటే భయపడే స్టేజ్ కు చేరుకుంటున్నాయి కొన్ని ప్రాంతాలు. అయితే ఈ నదులన్నిటికి బిన్నంగా ఉంటుంది ఈశాన్య రాష్ట్రాల్లోని ఒకటైన మేఘాలయాలో .. అక్కడ ఉన్న ఓ నది.. స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తుంది. ఎంత స్వచ్ఛమైంది అంటే.. ఆ నది నీటి అడుగున ఉన్న రాళ్ళను కూడా మనం చూడవచ్చు.. వివరాల్లోకి వెళ్తే..

మేఘాలయాలో తూర్పు జాంతియా హిల్స్ జిల్లాలోని దాంకీ అనే పట్టణం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ఓ నది స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తుంది. అదే ఉంగోట్ నది. ఇక్కడ ప్రవహించే నదిలోని నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తుంటాయి. దీంతో అడుగున ఉన్న రాళ్ళూ, చేపలు కూడా కనిపిస్తూ.. చూపరులను ఆకర్షిస్తాయి. దీంతో ఈ నదిపై ప్రయాణించడానికి పర్యాటకులు ఆసక్తిని కనబరుస్తారు. నదిలోని నావలను చూస్తుంటే అవి గాల్లో తేలుతున్న అనుభూతిని ఇస్తూ కనువిందు చేస్తుంటాయి. అందుకనే ఈ నది ఆసియాలోనే అత్యంత శుభ్రమైన నదిగా ఖ్యాతి గాంచింది. మరి ప్రకృతి అందాలతో పాటు సుందరమైన దృశ్యాన్ని నదిపై పడవలో విహరిస్తూ.. ఆనందడోలికల్లో తేలిఆడడానికి పర్యాటకులు ఇష్టపడతారు. ప్రకృతి ఒడిలో సేదదీరుతారు.

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు ఎలా వెళ్లాలంటే.. ముందుగా గౌహతి వరకూ విమానంలో వెళ్లి.. అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అద్దె కోసం టాక్సీలు దొరుకుతాయి. పర్యాకులకు స్వచ్ఛమైన మనస్సులో స్థానికులు స్వాగతం చెబుతారు.

Also Read: తమిళనాడులో ఎలక్షన్ హీట్.. ఒక్కరోజు సీఎంను కలిసిన కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి