Stress Relievers: మెంటల్ స్ట్రెస్‌తో మెదడుకి చేటు.. మీ మనసుకు చికిత్స చేసే పంచతంత్రాలు ఇవే!
రోజువారీ జీవనంలో భాగంగా పనిలో, ఇంట్లో, కుటుంబంలో మొదలైన వాటిలో అనేక రకాల ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. న్యూరోసర్జన్ డాక్టర్ స్టీవెన్ స్పిట్జ్ దీని గురించి చెబుతూ.. ఒత్తిడి మెదడుపై ఎలా సమస్యలను కలిగిస్తుందో వివరించారు..

ఈ భూమిపై ఒత్తిడి లేనివారు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకమైన మానసిక అలజడి ఉంటుంది. కానీ చాలామంది దానిని ఎదుర్కోవడంలో విఫలమవుతుంటారు. ఈ ఒత్తిడి కారణంగా శరీరంలో అనేక మార్పులు, సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజువారీ జీవనంలో భాగంగా పనిలో, ఇంట్లో, కుటుంబంలో మొదలైన వాటిలో అనేక రకాల ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. న్యూరోసర్జన్ డాక్టర్ స్టీవెన్ స్పిట్జ్ దీని గురించి చెబుతూ.. ఒత్తిడి మెదడుపై ఎలా సమస్యలను కలిగిస్తుందో వివరించారు. అధిక ఒత్తిడి వల్ల మెదడులో జరిగే మార్పు లేమిటో? దానిని సరిచేయడానికి ఏ అలవాట్లను అలవర్చుకోవాలో ఆయన వివరించారు. మెదడు చురుకుగా ఉండటానికి సహాయపడే టిప్స్ సూచించారు. అవేంటో తెలుసుకుందాం..
ఒత్తిడికి ప్రధాన కారణాలు
- కార్టిసాల్ హార్మోన్ అధికంగా విడుదల కావడం
- ఆలోచనా శక్తి కోల్పోవడం
- పేలవమైన శ్రద్ధ
మెదడులో కార్టిసాల్ అనేది ఒత్తిడి కలిగించే హార్మోన్. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రమే మెదడు కార్టిసాల్ హార్మోన్‌ను పెంచుతుంది. న్యూరోసర్జన్ డాక్టర్ స్టీవెన్ స్పిట్జ్ ఈ కార్టిసాల్ హార్మోన్ మెదడును ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. డాక్టర్ స్పిట్జ్ ప్రకారం.. ఎవరైనా ఒత్తిడికి గురైనప్పుడు, మెదడులోని అమిగ్డాలా భాగం ఒత్తిడికి లోనవుతుంది. ఇది భావోద్వేగ భాగం. ఆందోళన, భయం, సానుకూల భావోద్వేగాలను నియంత్రించే హార్మోన్ దీనిపై ప్రభావం చూపుతుంది. ఈ భాగంలో ఒత్తిడి పెరిగితే, అది మెదడుపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది పెరిగితే, కార్టిసాల్ హార్మోన్ కూడా పెరుగుతుంది. ఇది మెదడుపై, ఆరోగ్యంపై ఒత్తిడిని పెంచుతుంది.
ఒత్తిడి ఎలా దూరం చేసుకోవాలి..?
- ప్రతిరోజూ 10 నిమిషాలు నడవాలి.
- బాక్స్-బ్రీత్ (2-సెకన్లు పీల్చడం, 2-సెకన్లు పట్టుకోవడం, 2-సెకన్లు వదలం చేయాలి)
- మొబైల్ ఫోన్ల వినియోగం తగ్గించడం.
- నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








