AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యారెట్స్ నెలల తరబడి తాజాగా ఉండాలంటే.. ఈ సీక్రెట్ చిట్కా పాటించండి..!

ప్రతి రోజూ వంటలలో ఉపయోగించే క్యారెట్‌ లు రుచికరంగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఫ్రిజ్‌ లో ఉంచినప్పటికీ కొన్ని రోజుల్లోనే ఇవి ఎండిపోవడం లేదా పాడవడం చూస్తుంటాం. దీన్ని ఆపడానికి సులభమైన ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్స్ నెలల తరబడి తాజాగా ఉండాలంటే.. ఈ సీక్రెట్ చిట్కా పాటించండి..!
Carrots
Prashanthi V
|

Updated on: Jul 01, 2025 | 2:34 PM

Share

క్యారెట్‌ లలో సహజంగా ఎక్కువ తేమ ఉంటుంది. వీటిని ఎలా నిల్వ చేస్తామనే దానిపైనే అవి ఎక్కువకాలం తాజాగా ఉంటాయా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. తేమ ఎక్కువగా ఉంటే అవి మెత్తబడి పాడవుతాయి. అదే తేమ తక్కువగా ఉంటే ఎండిపోయి గట్టిగా మారిపోతాయి. క్యారెట్‌ లలో తేమను సమతుల్యంగా ఉంచి ఎక్కువ కాలం తాజాగా నిల్వ చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

  • తాజాగా ఉంచే చెఫ్ చిట్కా.. మీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన క్యారెట్‌ లను ముందుగా శుభ్రంగా కడగకూడదు. వాడే సమయానికి ముందు కడగడం మంచిది.
  • జిప్‌ లాక్ బ్యాగ్‌ ను సిద్ధం చేయండి.. ఒక శుభ్రమైన జిప్‌ లాక్ ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. ఇది గాలి తక్కువగా చొరబడేలా ఉండాలి. క్యారెట్‌ లను ఇందులో పెట్టాలి.
  • పేపర్ టవల్ ఉపయోగించండి.. సాధారణ కిచెన్ పేపర్ టవల్ తీసుకుని జిప్‌ లాక్ బ్యాగ్‌ లో క్యారెట్‌ లతో పాటు ఉంచండి. ఇది రెండు రకాలుగా పని చేస్తుంది. అధిక తేమను పీల్చుకుంటుంది. అవసరమైన తేమను నిలుపుతుంది.
  • సీల్ చేసి ఫ్రిజ్‌లో ఉంచండి.. బ్యాగ్‌ను గట్టిగా మూసి, గాలి ప్రవేశించకుండా చూసి ఫ్రిజ్‌ లో ఉంచండి. ఫ్రిజ్‌ లో ఎక్కువ చల్లదనం ఉండే భాగంలో కాకుండా మధ్యస్థాయిలో ఉంచితే ఉత్తమం.

ఎంతకాలం తాజాగా ఉంటాయి..?

ఈ విధానాన్ని పాటిస్తే క్యారెట్‌ లు సాధారణంగా 1 నుండి 2 వారాల పాటు పాడవకుండా తాజాగా ఉంటాయి. ఒకవేళ మీరు క్యారెట్‌ లను ఎక్కువ తేమ ఉన్న ప్రదేశంలో నిల్వ చేస్తుంటే.. పేపర్ టవల్‌ ను ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల క్యారెట్‌ లు మరింత ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

చిట్కాలు

  • క్యారెట్‌ లపై ఆకులు ఉంటే వాటిని తీసివేయండి. ఎందుకంటే అవి తేమను ఎక్కువగా పీల్చుకుంటాయి.
  • బదులుగా వాటిని సూప్స్‌ కి ఉపయోగించవచ్చు.
  • పొడిగా పెట్టాలన్న ఉద్దేశంతో నేరుగా డబ్బాలో ఉంచడం తప్పు ఎందుకంటే అవి త్వరగా ఎండిపోతాయి.

క్యారెట్‌ లను సరైన విధంగా నిల్వ చేస్తే మాత్రమే అవి తమ అసలైన రుచి, పోషకాలను నిలుపుకుంటాయి. మీరు ఫ్రిజ్‌ లో క్యారెట్ నిల్వ విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పడుతుంటే.. పై సూచనలు పాటించి చూడండి. ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది.