- Telugu News Photo Gallery Are you thinking of something new to make at home? This green chicken curry is the best
Green Chicken Curry: ఇంట్లో కొత్తగా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.? ఈ గ్రీన్ చికెన్ కర్రీ బెస్ట్..
చాలామంది ఇంట్లో కొత్త వంటకం ఏదైన ట్రై చేయాలి అనుకొంటారు. అయితే ఏం చెయ్యాలో తెలియక ఆలోచనలో పడతారు. అలంటివారు ఇంట్లో గ్రీన్ చికెన్ కర్రీ ట్రై చేయండి. ఏది ఎంతో రుచికరంగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది. మరి ఈ గ్రీన్ చికెన్ కర్రీ ఇంట్లో తయారుచేసుకోవడం ఎలా.? ఈరోజు మనం తెలుసుకుందాం రండి..
Updated on: Jul 02, 2025 | 1:50 PM

చికెన్, కొత్తమీర గుప్పెడ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిపాయ, జీడిపప్పు, మిరియాల పొడి, పసుపు, పెరుగు, గరం మసాలా, నూనె గ్రీన్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు. ముందుగా షాప్ నుంచి తెచ్చుకొని ఉంచుకోవాలి.

ముందుగా మీరు షాప్ నుంచి తెచ్చుకున్న చికెన్‌ను మంచి నీటితో శుభ్రంగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి , పుదీనా, ఫ్రై చేసిన ఉల్లి ముక్కలు, జీడిపప్పును వేసి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత ఒక బౌల్‌లో కడిగిన చికెన్‌కు ఉప్పు, నల్ల మిరియాల పొడి, పసుపు,పెరుగు, గ్రైండ్ చేసిన గ్రీన్ పేస్టును వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్‌లో నూనె తీసుకొని స్టౌవ్‌పై వేడి అయిన తర్వాత రెడీగా ఉంచుకున్న చికెన్ మొత్తం వేసి బాగా కలపాలి.

తర్వాత మూత ప్యాన్‌పై పెట్టి మీడియం ఫ్లెమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిసాలు పాటు స్టౌవ్‌పై ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత అందులో గరం మసాలా వేసుకోని ముక్క ఉడికిందో లేదో చూసుకొని అవసరం మేరకు ఉప్పును కలుపుకోవాలి.

మళ్లీ కాసేపు సిమ్‌లో ఉడికించుకోవాలి. అంతే.. టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ కర్రీ రడీ అయినట్లే. ఈ కర్రీ రైస్, చపాతీ, పరోటాతో రుచిగా ఉంటుంది. ఇది మీ ప్రియమైనవారికి, పిల్లలకి, కుటుంబ సబ్యులకు కచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చెయ్యండి.




