Lifestyle: హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారా?.. అయితే ఇలా ఈజీగా చెక్‌పెట్టండి!
ప్రజెంట్ జెనరేషన్‌లో ఫాస్ట్‌లైఫ్, పనిభారం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా హెయిల్ ఫాల్. ఇది ప్రతి ఒక్కరికి పెద్ద సమస్య. ఈ అలవాట్ల కారణంగా కొందరికి 25 ఏళ్లకే బట్టతల వస్తుంది. అయితే మనం కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుదాం.

ప్రస్తుత ఫాస్ట్‌లైఫ్‌లో పనిభారం, ఫాస్ట్‌లైఫ్ స్టైల్ వల్ల అనేక మంది రకరకాలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా హెయిల్ ఫాల్. మనం ఆహారపు అలవాట్లు, రోజూ చేసే కొన్ని పనుల వల్ల మనకు తెలియకుండానే హెయిర్ లాస్ జరుగుతుంది. ఈ కారణంగా కొందరికి 25 ఏళ్లకే బట్టతల వస్తుంది. ఇదొక్కటే కాదు జుట్టు రాలడం, చివర్లు చిట్లడం, జుట్టు నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలు అనే సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలన్నింటిని అధిగమించి ఒత్తైన జుట్టును పొందాలంటే మనం కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలు. దీనితో జుట్టు రాసే సమస్యకు మనం చెక్‌పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మన ఆహారపు అలవాట్లలో ఏ అంశాలు మన జుట్టు రాలేందుకు కారణమవుతాయో స్పష్టంగా తెలియనప్పటికీ.. హై షుగర్, ఎక్కువ కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలతో గుండె సంబంధిత వ్యాధులు రావడంతో పాటు మన కణాల్లో ఒత్తిడి కలుగుతుంది. దీనితో మన శరీరం మరింత సున్నితంగా మారుతుంది. ఈ కారణంగా తలెత్తే సమస్యలలో జుట్టు రాలడం కూడా ఒకటి. కాబట్టి అధిక షుగర్, ఎక్కువ కోవ్వు ఉండే పదార్థాలకు జుట్టు పెరగాలనుకునే వారు దూరంగా ఉంటే మంచింది.
జుట్టు రాలకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.
అయితే అధిక ప్రొటీన్లు, ఐరన్, జింక్, బి విటమిన్ వంటి ఖనిజాలు అధికంగా ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అవి మన జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయట. వీటితో పాటు చేపలు, వర్జిన్ ఆలివ్ ఆయిల్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం కలిగిన ఆహారం కూడా మన జుట్టును కాపాడుతాయట. చాలా వరకు అధ్యయనాలు కూడా ఇవే చెబుతున్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,డ్రైప్రూట్స్, మొలకలు వంటి ఆరోగ్యకర కొవ్వులతో కూడిన ఆహారాన్ని రోజు తీసుకోవడం వల్ల మన జుట్టు ఆరోగ్యం మెరుగుపడి రాలకుండా ఉంటుందట. అంతేకాకుండా ఒత్తుగా కూడా పెరుగుతుందట.
గమనిక: ఈ అంశాలు కొన్ని, నివేదికలు, నిపుణుల సలహాల మేరకు తెలియజేస్తున్నాం.. వీటి పట్ల మీకు ఎవైనా సందేహాలు ఉంటే.. అందుకు సంబంధించిన వైద్యులు సహాలు తీసుకోండి!
మరన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




