Gongura: గోంగూరతో డయాబెటీస్ కంట్రోల్.. వీటిని కూడా మాయం చేయవచ్చు!
గోంగూర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గోంగూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోంగూర తినడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇంకా గోంగూర తింటే ఎలాంటి సమస్యలకు బైబై చెప్పొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకు కూరల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. దీని టేస్ట్ మాటల్లో చెప్పలేం. ఆకు కూరల్లో రారాజు ఎవరంటే గోంగూర అంటారు. ఎలా వండినా సరే చాలా కమ్మగా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ మరింత రుచి యాడ్ అవుతుంది. ఎలాంటి వెజ్, నాన్ వెజ్ వంటి వాటితో చేసినా సూపర్ అంతే. ముఖ్యంగా చికెన్, మటన్, రొయ్యలు, బోటీతో కర్రీలు చేసినా, నిల్వ పచ్చళ్లు చేసినా.. తిన్న వాళ్లు ఆహా అనాల్సిందే. గోంగూర తినడం వల్ల కేవలం రుచే కాదండోయ్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గోంగూర ఎక్కువగా తింటే వేడి చేస్తుందని చాలా మంది దూరం పెడతారు. కానీ వారంలో రెండు, మూడు సార్లు ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి గోంగూరతో ఉండే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గోంగూరలో ఉండే పోషకాలు:
గోంగూరలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు సి, ఎ, కె, బి1, బి2, బి9లు ఉంటాయి. అలాగే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, కెరోటిన్, ఐరన్, రెబోఫ్లేవిన్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
గోంగూర తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే.. సీజనల్ వ్యాధులు త్వరగా ఎటాక్ చేయకుండా ఉంటాయి. జలుబు, దగ్గు, రొంప వంటివి రాకుండా ఉంటాయి. సహజసిద్ధమైన ఔషధంగా పని చేస్తుంది.
రక్తహీనత:
రక్త హీనత సమస్యతో బాధ పడేవారు గోంగూర తింటే చక్కగా రక్తం పడుతుంది. ఇందులో విటమిన్ కె, ఐరన్‌లు ఉంటాయి కాబట్టి.. రక్త హీనత సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు.
కంటి చూపు:
కంటి చూపు సమస్యలు ఉన్నవారు కూడా గోంగూర తింటే దృష్టి లోపాలు తొలగుతాయి. ఎలాంటి కంటి సమస్యలు త్వరగా ఎటాక్ చేయకుండా ఉంటాయి.
డయాబెటీస్ కంట్రోల్:
డయాబెటీస్ ఉన్నవారు కూడా గోంగూర తినవచ్చు. గోంగూర రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్‌ని తగ్గించి షుగర్‌ని కంట్రోలో ఉంచుతుంది.
ఎముకలు బలం:
గోంగూర తినడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు గోంగూర తింటే మంచి ఫలితం ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.




