ఎండలు మండే మధ్యాహ్నంలో చల్లని పుచ్చకాయ ముక్కలు ఆస్వాదించడం దాదాపు అందరకీ ఇష్టమే. వేసవి కాలంలో దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తింటుంటాం
TV9 Telugu
పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, అది ఏ సమయంలో తింటున్నామనేదే ముఖ్యం. ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత ఏ రకమైన పండ్లు తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
పుచ్చకాయలో 94 శాతం నీరు, లైకోపీన్, పొటాషియం వంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అయితే, ఇది కొద్దిగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. రాత్రి వేళ మన శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు ఇది జీర్ణక్రియను మందగింపజేస్తుంది
TV9 Telugu
మన జీర్ణవ్యవస్థ అత్యంత చురుగ్గా ఉన్న సమయంలో (మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య) పుచ్చకాయ తినడం ఉత్తమం. ఆయుర్వేదం ప్రకారం కూడా రాత్రి పూట పుచ్చకాయ తినడం మంచిది కాదు
TV9 Telugu
రాత్రి పూట మెటబాలిజం తకువగా ఉంటుంది. ఈ సమయంలో అధిక చకెర, నీరు ఉండే పుచ్చకాయ తింటే పొట్ట భారంగా అనిపించడం, గ్యాస్ పట్టేయడం లాంటి సమస్యలు వస్తాయి
TV9 Telugu
పుచ్చకాయలో నీటి శాతం ఎకువ. రాత్రి పడుకునే ముందు దీన్ని తింటే పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది
TV9 Telugu
ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో రాత్రి పూట బిర్యానీ వంటి భారీ భోజనం చేయడం ఒక సంస్కృతిగా మారింది. ఇలాంటి భారీ భోజనం తర్వాత పండ్లు తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
ఐబీఎస్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు రాత్రి పూట పుచ్చకాయకు దూరంగా ఉండాలి. చక్కరవ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునే వారు సైతం దూరంగా ఉండటమే మేలు