రోజుకు ఎన్ని మామిడిపండ్లు తినాలి.. ఎక్కువ తింటే ఏమవుతుందో తెలుసా..?
Krishna
11 May 2026
మామిడిపండులో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే అతిగా తింటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
పోషకాల గని
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒకటి లేదా రెండు మధ్యస్థ పరిమాణపు మామిడి పండ్లను తినడం సురక్షితం. ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన విటమిన్ సి లో 60 శాతం కేవలం ఒక కప్పు మామిడి ముక్కల నుండే అందుతుంది.
రోజుకు ఎన్ని తినాలి
మామిడి పండ్లలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లను డాక్టర్ సలహాతో చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
షుగర్ లెవల్స్‌పై ప్రభావం
మామిడి పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కానీ అతిగా తిన్నప్పుడు విరేచనాలు fచ్చే ప్రమాదం ఉంది. కొంతమందిలో కడుపు నొప్పి లేదా గ్యాస్ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
జీర్ణ సమస్యలు
ఆయుర్వేదం ప్రకారం.. మామిడి పండు వేడి గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, ముఖంపై మొటిమలు లేదా వేడి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తినేముందు అరగంట పాటు నీటిలో నానబెట్టాలి.
శరీరంలో వేడి
ఒక మధ్యస్థ పరిమాణపు మామిడి పండులో సుమారు 150 నుండి 200 కేలరీలు ఉంటాయి. మీరు భోజనం చేసిన తర్వాత మామిడి పండును డెజర్ట్‌గా తీసుకుంటే, మీ శరీరానికి అదనపు కేలరీలు అందుతాయి. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటది.
బరువు పెరిగే అవకాశం
కొంతమందికి మామిడి పండులోని ఉరుషియోల్ అనే పదార్థం వల్ల అలెర్జీ రావచ్చు. మామిడి తొక్క తిన్నప్పుడు లేదా పండు జిగురు తగిలినప్పుడు పెదవుల వాపు, దురద లేదా గొంతు నొప్పి రావచ్చు. ఇలాంటివారు మామిడికి దూరంగా ఉండటమే మంచిది.
అలెర్జీలు
మామిడి పండ్లను రాత్రి పూట తినడం కంటే ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్ లాగా తీసుకోవడం మంచిది. భోజనంతో పాటు కాకుండా భోజనానికి గంట ముందు లేదా తర్వాత తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.