మీ ఫ్రిజ్ దుర్వాసనను.. నిమ్మ చెక్కతో ఇలా చిటికెలో తరిమికొట్టండి!
11 May 2026
TV9 Telugu
TV9 Telugu
అందం నుంచి ఆరోగ్యం వరకూ నిమ్మ ఎన్నో విధాలుగా మనకు మేలు చేస్తుంది. వంటల్లోనే కాకుండా.. వంటగదిని శుభ్రం చేయడంలోనూ సాయపడుతుంది
TV9 Telugu
‘ఫ్రిజ్’ను తాజాగా ఉంచడంలోనూ నిమ్మకాయ ముందుంటుంది. దీనిని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో ఉంచితే అనేక ప్రయోజనాలు అందిస్తుంది. నిమ్మకాయలో ఉండే యాంటి బ్యాక్టీరియల్ లక్షణాలు.. ఫ్రిజ్‌లో తిష్ఠవేసిన బ్యాక్టీరియాను తొలగించడంలో సాయపడతాయి
TV9 Telugu
ఇతర ఆహార పదార్థాలపైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఫ్రిజ్ నిర్వహణ ఎంత బాగున్నా కొన్నిసార్లు దుర్వాసన వస్తూనే ఉంటుంది
TV9 Telugu
ఫ్రిజ్‌లో ఉంచిన ఆహార పదార్థాలపైనా ఈ వాసన ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు నిమ్మకాయ చెక్ పెడుతుంది. నిమ్మకాయను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో ఉంచితే సరి
TV9 Telugu
ఇందులోని సిట్రిక్ యాసిడ్.. ఫ్రిజ్‌లో దుర్వాసనను దూరం చేస్తుంది. లోపలి గాలిని తాజాగా, సువాసనగా మార్చేస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచినా.. ఎక్కువ రోజులు ఉన్నా చెడిపోతాయి
TV9 Telugu
అలాంటి వాటిని ఎక్కువకాలం తాజాగా ఉంచేందుకు.. నిమ్మకాయలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు సమర్థంగా పనిచేస్తాయి. ఆహార పదార్థాలు కుళ్లిపోకుండా కాపాడుతాయి. అయితే, ఫ్రిజ్‌లలో ఉంచడానికి తాజాగా, శుభ్రంగా ఉండే నిమ్మకాయలను మాత్రమే ఉపయోగించాలి
TV9 Telugu
నిండుగా పోషకాలు కలిగి ఉండే నిమ్మ రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఐరన్ వంటబట్టేలా చేస్తుంది. అరుగుదలకు సహాయకారిగా ఉంటుంది
TV9 Telugu
ఇందులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల గుండె సంబంధ వ్యాధులనూ నివారిస్తుంది. అంతేకాదు నిమ్మకే ప్రత్యేకమైన ఇంకో లక్షణం కూడా ఉంది. ఇది ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ, మన శరీరంలో క్షారతత్వానికి సంబంధించిన ఆల్కలైనైజింగ్ ప్రభావాన్ని చూపుతుంది. అలా శరీర పీహెచ్ స్థాయులను సమతూకంలో ఉంచుతుంది