Lifestyle: చిన్న వ్యాయామాలతో పెద్ద సమస్యకు చెక్.. అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు చేసిన అనంతరం వెల్లడించారు. ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (ARU)కి చెందిన పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన అధ్యయనం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. శారీరక శ్రమను మానసిక ఆరోగ్యానికి చికిత్సగా ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పరిశోధనను చేపట్టారు. ఈ వివరాలను...

ఒకప్పుడు అనారోగ్యం అంటే కేవలం శారీరానికి సంబంధించినది మాత్రమే అనుకునే వాళ్లం. కానీ మారుతోన్న కాలంతో పాటు వ్యాధులు కూడా మారాయి. ఇప్పుడు మానసిక సమస్యలతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. పెరిగిన పని ఒత్తిడి, జీవన విధానంలో మార్పుల కారణంగా చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మానసిక నిపుణులను సంప్రదిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే మానసిక సమస్యలను దూరం చేయడానికి చిన్న చిన్న వ్యాయామాలు చేసినా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు చేసిన అనంతరం వెల్లడించారు. ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (ARU)కి చెందిన పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన అధ్యయనం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. శారీరక శ్రమను మానసిక ఆరోగ్యానికి చికిత్సగా ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ పరిశోధనను చేపట్టారు. ఈ వివరాలను న్యూరోసైన్స్ అండ్ బిహేవియరల్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురించారు.
ఈ పరిశోధనల్లో తేలిన విషయాల ప్రకారం.. శారీరక శ్రమ చేయడం వల్ల డిప్రెషన్ రిస్క్ 23% తగ్గుతుందని, అలాగే ఆందోళన ప్రమాదాన్ని 26% తగ్గిస్తుందని కనుగొన్నారు. గార్డెనింగ్, గోల్ఫ్ ఆడటం, వాకింగ్ చేయడం వంటి చిన్న చిన్న శారీరక పనులు కూడా డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేశాయని పరిశోధనల్లో తేలింది. సాధారణ శారీరక శ్రమ స్కిజోఫ్రెనియా వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
అధ్యయనం ప్రకారం, శారీరక శ్రమ చేయడం వల్ల స్కిజోఫ్రెనియా ప్రమాదాన్ని 27% తగ్గించవచ్చు. మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ ఒకే రకమైన ఫలితాలు ఉన్నట్లు కనుగొన్నారు. శారీరక శ్రమ మానసిక ఆరోగ్యానికి సమర్థవంతమైన చికిత్సగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలిందని అధ్యయానికి నాయకత్వం వహించిన లీ స్మిత్ తెలిపారు. కాబట్టి డిప్రెషన్ సమస్యతో బాధపడేవారు శారీరక శ్రమను పెంచడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
