Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: చిటికీమాటికి కాళ్లు ఊపే అలవాటు ఉందా? అయితే, మీరు పెను ప్రమాదంలో పడినట్లే..

చాలామంది కూర్చున్నప్పుడు లేదా పడుకునేటప్పుడు కాళ్లు ఊపుతూ ఉంటారు. కొందరికీ కాలు మీద కాలు వేసుకొని ఇదోక పనిలా ఊపుతూ ఉంటారు. అయితే పాదాలు అలా ఎందుకు ఊపాల్సి వస్తుంది..

Health Tips: చిటికీమాటికి కాళ్లు ఊపే అలవాటు ఉందా? అయితే, మీరు పెను ప్రమాదంలో పడినట్లే..
Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 25, 2022 | 6:16 AM

Causes of Leg Shaking: చాలామంది కూర్చున్నప్పుడు లేదా పడుకునేటప్పుడు కాళ్లు ఊపుతూ ఉంటారు. కొందరికీ కాలు మీద కాలు వేసుకొని ఇదోక పనిలా ఊపుతూ ఉంటారు. అయితే పాదాలు అలా ఎందుకు ఊపాల్సి వస్తుంది.. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.? లేకపోతే.. ఈ విషయాలను తెలుసుకోండి.. సాధారణంగా కాళ్లు ఊపడాన్ని చాలామంది శుభం, అశుభాలతో పొలుస్తారు. ఎక్కువగా.. కాళ్లు ఊపడం వల్ల అశుభం (కీడు) జరుగుతుందని పెద్దలు పేర్కొంటారు. అయితే, కాళ్లు ఊపడం వల్ల ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మంచం మీద పడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు కాళ్ళను ఊపుతుంటే అది చాలా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాళ్ల నొప్పులతోపాటు ఎముకలు బలహీనంగా మారుతాయి. అయితే, పాదాలు ఎందుకు ఊపకూడదు.. దానివల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐరన్ లోపానికి సంకేతం..

కాళ్లు కదిలించే అలవాటు కొందరిలో ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు నేరుగా హాని కలిగించదు. కానీ ఈ చెడు అలవాటు కారణంగా కొంత హాని కలగవచ్చు. ముఖ్యంగా కాళ్లను కదిలించే అలవాటు ఉంటే అది ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

రెస్ట్‌లేస్‌ సిండ్రోమ్ నర్వస్‌ సిస్టమ్‌..

పాదాలను కదిలించే అలవాటు ఉన్న వ్యక్తుల్లో 10 శాతం మందికి రెస్ట్‌లెస్ సిండ్రోమ్ నాడీ వ్యవస్థ సమస్య ఉండవచ్చు. 35 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య సర్వసాధారణం. కాళ్ళు కదిలే అలవాటు విరామం లేని సిండ్రోమ్ నాడీ వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే, కొన్ని ఇతర కారణాల వల్ల కూడా కాళ్లు వణుకుతాయి.

నిద్ర లేకపోవడం..

కాళ్లను కదపడం ద్వారా మన శరీరంలో డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. దీని కారణంగా వ్యక్తికి కాళ్లను మళ్లీ మళ్లీ కదుపుతున్నట్లు అనిపిస్తుంది. ఈ సమస్య నిద్ర రుగ్మతలతో కూడా ముడిపడి ఉంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు నిద్ర లేకపోవడం వల్ల ప్రజలు తమ పాదాలను కదుపుతున్నారని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి.

హార్మోన్ల మార్పులు..

శరీరంలో హార్మోన్ల మార్పుల సమయంలో కూడా కాళ్ళను కదిలించాలనే కోరికను కలిగిస్తాయి. ఇది క్రమంగా అలవాటుగా మారుతుంది. ముఖ్యంగా గర్భధారణ, థైరాయిడ్, పీరియడ్స్ సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..