AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం సుఖీయం…లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

అరిసెలు లాంటి ఎన్నో రకాల పాతకాలం వంటలు ఇప్పటికీ చేస్తున్నా కానీ కొన్ని రకాల వంటలు దాదాపు కనుమరుగైపోయాయి. అలాంటి వాటిలో ఒకటి సుఖీయం. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రసాదం లాగాను లేదా పెళ్ళిళ్ళు లాంటి అకేషన్స్ లో చేసేవారట. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి. ఇందులో వాడిన పెసల పూర్ణాన్ని నాలుగైదు రోజుల పాటు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో ఈ స్వీట్ చేసుకోవచ్చు. లాభాలు కూడా బోలెడు.. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం సుఖీయం...లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..
Vijayanagara Empire Food
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2026 | 3:50 PM

Share

అరిసెలు, బూరెలు లాంటి పాతకాలపు వంటకాలు మనకు తెలుసు.. కానీ, విజయనగర సామ్రాజ్యంలో విశేష ఆదరణ పొందిన సుఖీయం అనే అద్భుతమైన స్వీట్ కాలక్రమేణా కనుమరుగైపోయింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీనిని దేవుడి ప్రసాదంగా, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలలో ప్రత్యేకంగా వడ్డించేవారట. బూరెల తరహాలోనే ఉంటూ, పెసల పూర్ణంతో చేసే ఈ సుఖీయం తయారీ విధానం ఇక్కడ చూద్దాం.

కావలసిన పదార్థాలు:

పెసలు: 1 కప్పు (7-8 గంటలు నానబెట్టినవి)

తురిమిన బెల్లం: కప్పు (తీపిని బట్టి)

ఇవి కూడా చదవండి

పచ్చి కొబ్బరి తురుము: కప్పు

యాలకుల పొడి: స్పూన్‌

గోధుమ పిండి (పై పూత కొరకు): 1 కప్పు

పసుపు: స్పూన్‌

నెయ్యి: 2 స్పూన్లు

ఉప్పు: చిటికెడు

నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా పెసలను బాగా కడిగి 7-8 గంటలపాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన 1 కప్పు పెసలను కుక్కర్‌లో వేసి, 2 కప్పుల నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పెసలు మరీ పేస్ట్‌లా అవ్వకుండా చూసుకోవాలి. ఉడికిన తర్వాత అదనపు నీటిని వడకట్టి, పెసలను పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పెసల పూర్ణం తయారు చేసుకోవాలి.

దీని కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు పెసలకి ఒకటిన్నర కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం కరగడానికి పావు కప్పు వరకు నీళ్లు పోసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉడికించాలి. ఇక్కడ మీరు తినే తీపిని బట్టి బెల్లం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగి పాకం నురగలు వచ్చి జిడ్డుగా అయిన తర్వాత ఉడికించి చల్లారబెట్టుకున్న పెసలు వేసి, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, ఫ్లేవర్ కోసం పావు స్పూన్ వరకు యాలకుల పొడి వేసి మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరపడ్డాక 1 స్పూన్ నెయ్యి వేసి, స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక చిన్న చిన్న బాల్స్‌లా చుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ సిద్ధం చేసుకోవాలి.

ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బజ్జీల పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి మరీ లూస్ అయితే పూర్ణం బయటకు వస్తుంది. గట్టిగా అయితే పైన పొర మందంగా అయి రుచి తగ్గుతుంది. దీనిని 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టౌవ్‌ పైన కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగనివ్వాలి. నూనె సరిగ్గా కాగకపోతే నూనె పీల్చేస్తాయి.

ఇప్పుడు పెసల పూర్ణం ఉండలను గోధుమపిండి బ్యాటర్‌లో ముంచి జాగ్రత్తగా నూనెలో వేయాలి. ఒకటి వేసిన 10 సెకన్ల తర్వాతే మరొకటి వేయాలి. ఒకదానికొకటి అంటుకుంటే ఫోర్క్‌తో నెమ్మదిగా విడదీయాలి. గోధుమపిండి బ్యాటర్ వల్ల నూనెలో వేసినప్పుడు తోకల్లాంటివి వస్తే, చూడటానికి బాగుండవు కాబట్టి కిచెన్ కత్తెరతో వాటిని కట్ చేసి తీసేయవచ్చు.

ఈ పెసల పూర్ణాన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి 4-5 రోజుల పాటు ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి కలిపి చిటికెలో వేడివేడిగా సుఖీయం సిద్ధం చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే ఈ రాయలనాటి రుచిని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us