AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 హోమ్‌మేడ్ చిట్కాలతో చెక్ పెట్టండి!

అందంగా కనిపించడానికి చాలామంది ముఖ చర్మ రక్షణ పై చూపించే శ్రద్ధను మెడ భాగంపై చూపించరు. దీనికారణంగా ముఖం కాంతివంతంగా ఉన్నప్పటికీ.. మెడపై సన్నని గీతలు, ముడతలు, లూజ్ స్కిన్ స్పష్టంగా కనిపిస్తుంటాయి. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం, సూర్యరశ్మి ప్రభావం, డీహైడ్రేషన్, నిరంతరం స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు చూస్తూ తల వంచే అలవాటు వల్ల మెడపై త్వరగా ఏజింగ్ సంకేతాలు వస్తుంటాయి. అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో మెడ ముడతలను తగ్గించి చర్మాన్ని టైట్‌గా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5 హోమ్‌మేడ్ చిట్కాలతో చెక్ పెట్టండి!
Neck Wrinkles And Sagging Skin
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2026 | 9:21 PM

Share

వయసు పెరిగే కొద్దీ లేదా సరైన పోషణ లేకపోవడం వల్ల ముఖంతో పాటు మెడ చర్మంపై కూడా ముడతలు, లూజ్ స్కిన్ సమస్య ఏర్పడుతుంది. శరీరంలో కొల్లాజెన్ లోపించడం, ఎండ దెబ్బ, గంటల తరబడి తల వంచి కూర్చోవడం కూడా దీనికి కారణం కావచ్చు. అయితే పార్లర్ ఖర్చులు లేకుండా ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో మెడ ముడతలను సులభంగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

అలోవెరా జెల్:

అలోవెరాలో యాంటీ ఏజింగ్ గుణాలు, విటమిన్లు, అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేసి సహజమైన తేమను అందిస్తాయి. తాజా కలబంద జెల్‌ను మెడపై రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

కొబ్బరి నూనె మసాజ్:

కొబ్బరి నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి. రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని మెడపై కింద నుంచి పైకి మసాజ్ చేయడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ముడతలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

తేనె, నిమ్మరసం మాస్క్:

తేనె చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తే, నిమ్మరసంలోని విటమిన్ సి చర్మాన్ని బిగుతుగా మార్చడానికి దోహదపడుతుంది. ఒక చెంచా తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి మెడపై 15-20 నిమిషాలు ఉంచి కడిగేస్తే చర్మం తాజాదనంతో మెరుస్తుంది.

గోరువెచ్చని ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్‌లో విటమిన్ A, E లు సమృద్ధిగా ఉంటాయి. రాత్రి వేళల్లో గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో మెడపై మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగై, చర్మం లోపలి పొరల వరకు పోషణ అందుతుంది.

విటమిన్ E ఆయిల్ :

విటమిన్ E క్యాప్సూల్‌ను కట్ చేసి అందులోని నూనెను నేరుగా మెడపై అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది కొత్త స్కిన్ సెల్స్ తయారీకి సహాయపడటమే కాకుండా లూజ్ స్కిన్‌ను టైట్ చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. హోమ్‌మేడ్ ప్యాక్స్‌తో పాటు బయటకు వెళ్లేటప్పుడు ముఖంతో పాటు మెడకు కూడా తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ రాయడం మరియు రోజూ తగినన్ని నీళ్లు తాగి హైడ్రేటెడ్‌గా ఉండటం ఎంతో ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
శని సాడే సతి ముగిశాక అదృష్టం మారుతుందా? జీవితంలో వచ్చే 5 కీలక..
శని సాడే సతి ముగిశాక అదృష్టం మారుతుందా? జీవితంలో వచ్చే 5 కీలక..
ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
అవమానాలను అధిగమించి వైద్యురాలిగా.. రూత్ జాన్ పాల్ విజయగాథ!
అవమానాలను అధిగమించి వైద్యురాలిగా.. రూత్ జాన్ పాల్ విజయగాథ!
దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న జంతువును గుర్తిస్తే మీరే తోపు!
దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న జంతువును గుర్తిస్తే మీరే తోపు!
ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్‌లో అడ్డంకులా? కెరీర్ పురోగతికి.
ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్‌లో అడ్డంకులా? కెరీర్ పురోగతికి.
ఆ భారాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటా.. పెద్ది వివాదం పై జాన్వీ..
ఆ భారాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటా.. పెద్ది వివాదం పై జాన్వీ..
కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ
కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ
అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
మరో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే
మరో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే
నరాల బలహీనత తగ్గి శరీరం ఉక్కులా మారిపోద్ది..
నరాల బలహీనత తగ్గి శరీరం ఉక్కులా మారిపోద్ది..