AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం పరుగులు..

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశాన్ని అర్థరాత్రి భూకంపం ఉలిక్కిపడేలా చేసింది. రాత్రి 10:23 గంటల ప్రాంతంలో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 సెకన్ల పాటు భూమి బలంగా కంపించింది. ఉన్నట్టుండి మంచాలు, ఫ్యాన్లు ఊగిపోవడంతో ఎత్తైన అపార్ట్‌మెంట్లలోని ప్రజలు తీవ్ర భయాందోళనలతో అర్ధరాత్రి వేళ రోడ్లపైకి పరుగులు తీశారు.

Earthquake: ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం పరుగులు..
Earthquake In Delhi Ncr
Krishna S
|

Updated on: Oct 06, 2026 | 11:55 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి 10:23 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లతో కూడిన ఎన్‌సీఆర్ పరిధిలో భూమి బలంగా కంపించింది. సుమారు 30 సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగడంతో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు తీవ్ర భయంతో మెట్ల గుండా కిందకు దిగి ఖాళీ ప్రదేశాలు, రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. దీని కేంద్రం ఖదూన్ లగా గ్వాలీకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. దీనికి తోడు ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ ప్రాంతంలో కూడా 4.4 తీవ్రతతో మరో ప్రకంపన నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని దాదాపు అన్ని జిల్లాలతో పాటు పక్కనే ఉన్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.

యూపీలో భూ ప్రకంపనలు

మరోవైపు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, నోయిడా, మీరట్ వంటి ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు, ఎత్తైన హౌసింగ్ సొసైటీలలో ఫ్యాన్లు, లైట్లు ఊగిపోవడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అటు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో సంభవించిన భారీ భూకంప ప్రభావం కూడా ఉత్తర భారతదేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలపై కనిపించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం భౌగోళికంగా భూకంపాలు సంభవించే అధిక ముప్పు ఉన్న ప్రాంతాల జాబితాలోకి వస్తుంది. శాస్త్రీయ వర్గీకరణ ప్రకారం ఢిల్లీ ప్రాంతాన్ని అత్యంత సున్నితమైన సీస్మిక్ జోన్-4 పరిధిలో చేర్చారు. హిమాలయ పర్వత శ్రేణులకు సమీపంలో ఉండటం, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరంతరం ఫలకాల కదలికలు జరుగుతుండటం వల్ల ఇక్కడ తరచూ భూ ప్రకంపనలు నమోదవుతుంటాయి.

భూమి లోపలి పొరల్లో ఉండే ఏడు ప్రధాన టెక్టోనిక్ ఫలకాలు నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. ఇవి కలిసే ప్రదేశాలను ఫాల్ట్ లైన్లు అంటారు. ఈ ఫలకాలు తీవ్రమైన ఒత్తిడికి గురై వంగిపోవడం లేదా విరిగిపోవడం జరిగినప్పుడు, భూగర్భం నుంచి అపారమైన శక్తి తరంగాల రూపంలో పైకి దూసుకువస్తుంది. ఈ శక్తినే మనం భూకంప ప్రకంపనలుగా అనుభవిస్తాం.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..