Rose Water: అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా.. ముఖ్యంగా ఈ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం..!

రోజ్ వాటర్‌తో ఆరోగ్యానికి కూడా చాలా రకాలు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కొంత మంది మందులు, ఆహార పదార్థాలలో..

Rose Water: అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా.. ముఖ్యంగా ఈ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం..!
Rose Water Health Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 19, 2023 | 9:18 PM

చర్మ సంరక్షణలో రోజ్ వాటర్‌కి ప్రత్యక స్థానం ఉంది. అందుకే చాలా ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు. గులాబీ రేకుల నుంచి తయారైన ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి , పోషణకి ఉపయోగపడుతుంది. దీనిలోని కొన్ని రకాల పోషకాలు మన చర్మాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. రోజ్ వాటర్‌తో ఆరోగ్యానికి కూడా చాలా రకాలు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కొంత మంది మందులు, ఆహార పదార్థాలలో కూడా రోజ్ వాటర్ వాడతారు. మార్కెట్‌లో లభించే రోజ్ వాటర్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇక ఇది మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గాయాలు: రోజ్ వాటర్ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా గాయాలు వేగంగా నయం అవుతాయి. గులాబీ రేకుల నుంచి ఇతర మందులని తయారు చేస్తారు. వీటిని గాయాలు, చర్మ అలెర్జీలు లేదా ఇతర సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

ఒత్తిడి: రోజ్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. గులాబీ రేకులతో చేసిన నీళ్లతో స్నానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతతతోపాటు మంచి అనుభూతి కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

గొంతు నొప్పి: ప్రాచీన కాలంలో భారతీయులు గులాబీ రేకుల ద్వారా కూడా మందులని తయారుచేసేవారు. దీనికి ఆయుర్వేదంలో కూడా ప్రముఖ స్థానం ఉంది. నేటికీ స్వదేశీ మందులలో రోజ్ వాటర్ చేర్చడం ద్వారా గొంతులో వాపుని తొలగించవచ్చు. దీని యాంటీ బాక్టీరియల్ ప్రభావాలు గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

కంటి చికాకు: పాత రోజుల్లో కళ్లను శుభ్రం చేయడానికి రోజ్ వాటర్‌ను ఉపయోగించేవారు. ఇది కళ్ళలో చికాకు లేదా దురదను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నేటి కాలంలో కంటి సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో రోజ్ వాటర్ ఖచ్చితంగా వినియోగిస్తారు. చర్మానికి, కళ్లకు చల్లదనాన్ని ఇచ్చే రోజ్ వాటర్‌ని కూలింగ్ ఏజెంట్ అని కూడా అంటారు.

జీర్ణక్రియ: అనేక పరిశోధనలలో రోజ్ ఎసెన్స్‌తో కడుపు సమస్యలను సులభంగా అధిగమించవచ్చని తేలింది. పురాతన కాలంలో గులాబీ రేకులను కడుపుని శాంతపరచడానికి ఉపయోగించేవారు. రోజ్ వాటర్‌తో ఉబ్బరం లేదా ఇతర కడుపు సమస్యలను తగ్గించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..