AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toll Charges: ఈ 2 సందర్భాల్లో టోల్ చార్జీ కట్టనవర్లేదు.. తెలియక చాలా మంది కట్టేస్తుంటారు.. అవేమిటంటే..?

కేవలం రెండు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఆ మినహాయింపు ఉంటుంది. ఆ రెండు సందర్భాలు ఏమిటో తెలుసుకుని.. మీకు..

Toll Charges: ఈ 2 సందర్భాల్లో టోల్ చార్జీ కట్టనవర్లేదు.. తెలియక చాలా మంది కట్టేస్తుంటారు.. అవేమిటంటే..?
Toll Plaza
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 19, 2023 | 8:28 PM

Share

హైవేలపై టోల్ ప్లాజాలు ఉండడాన్ని మీరు చూసే ఉంటారు. ఇక ఈ టోల్ గేట్లు లేదా టోల్ ప్లాజా ఉన్న చోట టోల్ ట్యాక్స్ కట్టకుండా వెహికిల్‌తో వెళ్లడం చాలా కష్టం. పేదధనిక తేడా లేకుండా ఎవరైనా టోల్ కట్టాల్సిందే. ముఖ్యమంత్రి, గవర్నర్, రాష్ట్రపతి ఇలా కొందరు ప్రముఖులు మినహా ప్రతి ఒక్కరు టోల్ ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. ప్రభుత్వం ప్రజల రవాణా సౌకర్యార్థం ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త‌గా నిర్మించిన లేదా నిర్మించ‌బోయే జాతీయ ర‌హ‌దారుల‌పై ఎన్‌హెచ్ఏఐ టోల్ టాక్స్ వేస్తార‌న్న విసయం మనకు తెలిసిందే తెలుసు. అయితే ఈ రోడ్లపై టోల్ ట్యాక్స్ కట్టడానికి మనకు కూడా మినహాయింపు ఉంటుంది. కానీ అదెప్పుడు పడితే అప్పుడు కాదు. కేవలం రెండు ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఆ మినహాయింపు ఉంటుంది. ఆ రెండు సందర్భాలు ఏమిటో తెలుసుకుని.. మీకు ఇకపై అలాంటి సందర్భాలు ఎదురైతే టోల్ కట్టకుండా ఎంచక్కా వెళ్లిపోండి. ఎవరన్నా ఏమన్నా అడిగితే రూల్స్ చెప్పండి.

టోల్ గేట్ నుంచి 100 మీట‌ర్ల దూరం వ‌ర‌కు ట్రాఫిక్ జామ్ అయితే మనం టోల్ క‌ట్ట‌కుండానే గేట్ దాటి వెళ్ల‌వ‌చ్చు. టోల్ గేట్‌కు కొద్ది దూరంలో ఒక పసుపు రంగు లైన్ ఉంటుంది. ఆ లైన్‌కు అవ‌త‌ల ఎవ‌రైనా 10 లేదా అంత‌క‌న్నా ఎక్కువ సెకన్ల పాటు వేచి ఉన్న‌ట్ట‌యితే వారు కూడా టోల్ క‌ట్టాల్సిన ప‌నిలేదు. నేరుగా గేట్ నుంచి వెళ్లిపోవ‌చ్చు. ఇవి స్వయంగా నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆప్ ఇండియా జారీ చేసిన రూల్స్. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి సంద‌ర్భాలు గనక ఎదురైతే టోల్ చెల్లించ‌కండి. ఒక వేళ టోల్ సిబ్బంది ఇబ్బంది పెట్టినా, వాదించినా.. ఈ 2 రూల్స్‌ను క‌చ్చితంగా చెప్పండి.

అయితే సందు దొరికితే సామాన్యున్ని బాదడానికి చూసే టోల్ సిబ్బంది అంత సులువుగా మనల్ని వదులుతారా అంటే అనుమానమే. ఎందుకంటే మనమేం రూల్స్ ఫాలో అవ్వాలో చెప్తారు కానీ, వాళ్ల రూల్స్ గురించి మనం మాట్లాడితే మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఒక టోల్ వ్యవస్థే కాదు, అనేక వ్యవస్థలు ఇలాగే ఉంది. క‌నుక ఇవి తెలుసుకుని ముందు సాగ‌డం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి.