AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: త్వరగా బరువు తగ్గాలా..? ఇలా చేస్తే చాలు.. ఎంతటి కొవ్వు అయినా కోసి తీసినట్టే కరిగిపోతుంది..

బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది.  ముఖ్యంగా ఊబకాయం వంటి సమస్య తలెత్తి.. ఆపై దాని..

Weight Loss: త్వరగా బరువు తగ్గాలా..? ఇలా చేస్తే చాలు.. ఎంతటి కొవ్వు అయినా కోసి తీసినట్టే కరిగిపోతుంది..
Asanas for Weight Lose
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 19, 2023 | 8:53 PM

Share

నాజుకైన శరీరం కావాలని కోరుకోని స్త్రీ పురుషులు ఉండరు. ఇదే వారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ క్రమంలో అధిక బరువు ఉండి, తగ్గాలనుకునేవారికి యోగా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. యోగా చేస్తే బరువు తగ్గడమే కాకుండా యవ్వనంగా, తేలిగ్గా మారతారు. శారీరక దృఢత్వానికి అలవాటు పడిన బాడీ.. రోజంతా చురుగ్గా, శక్తివంతంగా కూడా ఉంటుంది. అదనంగా శరీరంలో పేరుకుపోయి కొవ్వు తగ్గుతుంది. బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది.  ముఖ్యంగా ఊబకాయం వంటి సమస్య తలెత్తి.. ఆపై దాని వల్ల చాలా సమస్యలు వస్తాయి. స్త్రీ, పురుషులిద్దరూ కూడా చాలా సమస్యల్ని ఫేస్ చేస్తారు. ఆ సమస్యని తగ్గించుకోవాలంటే యోగాలో కొన్ని భంగిమలు హెల్ప్ చేస్తాయి. వీటిని ఉదయం, సాయంత్రం చేయడం వల్ల మీ శరీరంలోని కొవ్వు కరగడమే కాక మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నౌకాసన: నౌకాసన పోశ్చర్ కోసం మీరు కూర్చున్న నేలపైనే మీ సీటుని ఉంచి అప్పర్, లోయర్ బాడీని సమానంగా పైకి లేపండి. మోకాళ్ళను వెనక్కి నిటారుగా ఉంచి, చేతులని నేలకి సమాంతరంగా ఉంచండి. ముందుకు మీ పొట్ట కండరాలను ఉంచి ఊపిరి పీల్చుకోండి.

హస్త ఉత్తనాసన:  ఈ రకమైన ఆసనం కోసం ముందుగా నిల్చోండి. మీ రెండు చేతలని పైకి లేపుతూ చాపి, కొంచెం వెనక్కి వంగి తల, మెడ బాగా వంచండి. పై భాగాన్ని వంచేటప్పుడు మీ చేతులను చెవుల పక్కన ఉండేలా చూసుకోండి.

ఇవి కూడా చదవండి

పాద హస్తాసన: హస్త ఉత్తనాసన చేయడం కోసం ఊపిరి పీల్చుకుని నిల్చోవాలి. ఇప్పుడు మళ్ళీ ఊపిరి పీలుస్తూ అప్పర్ బాడీని తుంటి క్రిందికి వంచి ముక్కుని మోకాళ్ళ మధ్య ఉంచండి. అరచేతులని పాదాలకు రెండువైపులా పెట్టండి. దీనికోసం కొద్దిగా వంచాల్సి ఉంటుంది. మెల్లి మెల్లిగా దీనిని చేయడం వల్ల లాభాలు ఉంటాయి. ఇది చేసేటప్పుడు మీ మోకాళ్ళు నిటారుగా పెట్టి ఛాతీతో తొడలు తాకేలా చూసుకోండి. మెడ కిందికి ఉండాలి. మోకాళ్ల మధ్య ముక్కుని ఉంచి అప్పర్, లోయర్ బాడీ ఒకేదగ్గర ఉండేలా చూసుకోండి.

వశిష్ఠాసన: ఈ పోశ్చర్ ప్లాంక్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎడమ అరచేతిని నేలపై గట్టిగా ఉంచి, కుడి చేతిని నేలపై తీసేయండి. మీ మొత్తం బాడిని కుడివైపుకు తిప్పు, కుడికాలు నేల నుండి పైకి లేపి ఎడమ కాలు మీద పెట్టండి. మీ కుడి చేతిని పైకి లేపండి. మీ వేళ్ళను ఆకాశం వైపు చూపేలా ఉంచండి. మీ మోకాలు, మడమలు, పాదాలు రెండూ కూడా ఒకదానితో ఒకటి సంపర్కంలో ఉన్నాయని నిర్ధారించుకోండి. మీ తలను తిప్పి, కుడి చేతివైపు చూడండి. అలా ఆ ఆసనంలో కాసేపు ఉండండి. అనంతరం అదేలా ఎడమవైపును అదే పునరావృతం చేయండి.

ఏక పాదాసన: ఈ ఏక పాదాసన పోశ్చర్ బరువు తగ్గేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా చేతులను పైకి చాచి, అరచేతులు, వీపుని ఊపిరి పీలుస్తు నేలకి సమాంతరంగా ఉంచండి. కుడి కాలు నిటారుగా ఉంచండి. కాలు, పెల్విస్, అప్పర్ బాడీ, చేతులు, అన్నీ సరళ రేఖలో ఉండేలా చూసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..