Baba Ramdev: మలబద్ధకం, గ్యాస్ సమస్యలకు.. బాబా రామ్‌దేవ్ చెప్పిన అద్భుత యోగా టెక్నిక్స్ ఇవే..
ఈ మధ్య కాలంలో ఆఫీసు పని, సరైన తిండి లేకపోవడం వల్ల జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. అయితే, యోగ గురువు బాబా రామ్‌దేవ్ చెప్పిన ఈ 5 అద్భుతమైన యోగాసనాలు మీ కోసమే. రోజుకు కొద్ది సమయం కేటాయిస్తే.. కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు మాయం అవుతాయి. ఆ 5 సులభమైన ఆసనాలు ఏమిటీ? వాటిని ఎలా చేయాలి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నేటి బిజీ లైఫ్‌లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు మలబద్ధకం, గ్యాస్. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ముఖ్యంగా ఆఫీసు ఉద్యోగులు ఎక్కువసేపు కూర్చోవడం వంటి కారణాల వల్ల ఈ కడుపు సమస్యలు సర్వసాధారణంగా మారాయి. నిరంతర మలబద్ధకం కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, బరువుగా అనిపించడానికి దారితీస్తుంది. ఈ సమస్యలకు యోగా అద్భుతంగా పనిచేస్తుందని యోగ గురువు బాబా రామ్‌దేవ్ తెలిపారు.
జీర్ణవ్యవస్థకు యోగా ఎలా సహాయపడుతుంది..?
బాబా రామ్‌దేవ్ ప్రకారం.. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. పేగు కదలిక పెరుగుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. యోగా చేయడం వల్ల రక్త ప్రవాహం మెరుగుపడి, ఉదర కండరాలు సాగి, ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా కడుపు సమస్యలకు ప్రధాన కారణమైన మానసిక ఒత్తిడిని యోగా సమర్థవంతంగా తగ్గిస్తుంది.
మలబద్ధకం, గ్యాస్ తగ్గించే ప్రభావవంతమైన యోగాసనాలు
కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ 5 యోగాసనాలు ఎంతో ప్రయోజనకరమని బాబా రామ్‌దేవ్ సూచించారు:
పవన్ముక్తాసనం: కడుపులో పేరుకుపోయిన గ్యాస్‌ను బయటకు పంపడంలో ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది. ఉదర ఉబ్బరాన్ని తగ్గించి, మృదువైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.
ఉత్తానపాదాసనం: ఈ ఆసనం ఉదర కండరాలను టోన్ చేస్తుంది. పేగుల కదలికను పెంచుతుంది. ఇది పేరుకుపోయిన గ్యాస్‌ను విడుదల చేసి, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
డవ భంగిమ (నౌకాసనం): ఇది ఉదర కండరాలను బలపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం సున్నితమైన ఉదర మసాజ్ లాగా పనిచేసి, గ్యాస్, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
వంతెన భంగిమ (సేతుబంధాసనం): ఈ ఆసనం ఉదరం, ఛాతీ ప్రాంతంపై తేలికపాటి ఒత్తిడిని కలిగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లత్వం, కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మలాసనం: ఈ ఆసనం పేగు కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం చేసే సమయంలో గోరువెచ్చని నీరు తాగడం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఈ ఆసనాలన్నింటినీ ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత చేయడం వల్ల సమస్యలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది.
ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి:
నీరు, ఫైబర్: యోగాతో పాటు రోజంతా తగినంత నీరు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
క్రమం తప్పని కదలిక: ఎక్కువసేపు కూర్చోవద్దు. ప్రతి గంటకు ఒకసారి కొద్దిసేపు నడవండి
వైద్య సలహా: సమస్య తీవ్రంగా ఉంటే లేదా నిరంతరంగా కొనసాగితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
యోగ కేవలం చికిత్స మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను నిర్వహించడానికి అవసరమైన క్రమశిక్షణను కూడా రోజువారీ జీవితంలోకి తీసుకువస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




