Cracked Heels: మడమల పగుళ్లకు కొబ్బరినూనె దివ్యౌషధం.. దీన్ని కలిపి రాసుకుంటే దూదిలాంటి పాదాలు..!
మహిళలు ఎక్కువగా ఈ సమ్యతో బాధపడతారు. తేమ లేకపోవడం, విటమిన్ లోపం, మధుమేహం, థైరాయిడ్, ఊబకాయం, 60 ఏళ్లు పైబడిన వారు మడమల పగుళ్ల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు కూడా పగిలిన మడమల సమస్యతో పోరాడుతూ ఉంటే, అది జన్యుపరమైన లేదా ఆరోగ్య కారణాల వల్ల కావచ్చు. దీనికి కారణం, నివారణ మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం..
పాదాలను శరీరానికి పునాదిగా పరిగణిస్తారు. మొత్తం శరీరం బరువు పాదాలపైనే ఉంటుంది. మన శరీరాన్ని కదిలించేది పాదాలు. అందుకే పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. పొడి వాతావరణంలో మడమల పగుళ్ల సమస్య సాధారణం. మహిళలు ఎక్కువగా ఈ సమ్యతో బాధపడతారు. తేమ లేకపోవడం, విటమిన్ లోపం, మధుమేహం, థైరాయిడ్, ఊబకాయం, 60 ఏళ్లు పైబడిన వారు మడమల పగుళ్ల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు కూడా పగిలిన మడమల సమస్యతో పోరాడుతూ ఉంటే, అది జన్యుపరమైన లేదా ఆరోగ్య కారణాల వల్ల కావచ్చు. దీనికి కారణం, నివారణ మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం..
పాదాల పట్ల అజాగ్రత్తగా ఉండటం వల్ల సాధారణంగా మడమల పగుళ్ల సమస్య పెరుగుతుంది. చెప్పులు లేదా ఓపెన్ షూలను ఉపయోగించడం వల్ల కూడా మడమల పగుళ్లు ఏర్పడతాయి. చాలా సార్లు పాదాల మడమలలో లోతైన పగుళ్ల కారణంగా భరించలేని నొప్పిని ఎదుర్కోవలసి ఉంటుంది. మీ పాదాల చర్మం తరచుగా పొడిగా మారుతుంది. పొడిబారినప్పుడు, అది మడమల పగుళ్లకు కారణం అవుతుంది. శరీరంలో తేమ లేకపోవడం వల్ల, సజీవ కణాలు గట్టిపడతాయి. మడమల ప్రాంతంలో చనిపోయిన కణాలు పెరుగుతాయి. దీంతో పాదాల పగులుతుంటాయి. అయితే మీరు కొన్ని నేచురల్ రెమెడీస్‌తో ఈ పగిలిన మడమలను వదిలించుకోవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
మీ చర్మానికి యవ్వనాన్ని, తాజాదనాన్ని తీసుకురావడానికి, వారానికి ఒకసారి మీ పాదాలకు ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండి. గోరువెచ్చని నీటిలో పాదాలను ముంచడం వల్ల మడమల చర్మం మృదువుగా మారుతుంది. మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ మీ పాదాలు, మడమల సరైన సంరక్షణ కోసం ప్రతిరోజూ స్నానానికి ముందు మీ పాదాలను స్వచ్ఛమైన బాదం నూనెతో మసాజ్ చేయండి.
స్నానం చేసిన తర్వాత, పాదాలు తడిగా ఉన్నప్పుడే క్రీమ్ అప్లై చేయండి. ఇది పాదాలపై తేమను నిలుపుదల చేస్తుంది. ఫుట్ క్రీమ్‌తో మీ పాదాలను సర్క్యులర్ మోషన్‌లో తేలికగా మసాజ్ చేయండి. ఇది మీ పాదాలను మృదువుగా ఉంచుతుంది. మడమల పగుళ్ల సమస్యను నివారిస్తుంది. పాదాల సమస్యలకు తేనె సహజ నివారణగా పనిచేస్తుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి పగిలిన మడమలను శుభ్రం చేస్తాయి. పగిలిన మడమలకు సహజంగా చికిత్స చేస్తాయి.
పగిలిన మడమల కోసం సహజ చికిత్స మీ వంటగదిలో కూడా అందుబాటులో ఉంది. నిమ్మకాయను కోసి అందులో సగం తీసుకుని అందులో పంచదార కలిపి మడమల మీద మెత్తగా రుద్ది తర్వాత శుభ్రమైన మంచినీటితో మడమలను కడగాలి. వారానికి రెండుసార్లు ఈ ప్రక్రియను అనుసరించడం వల్ల మంచి సానుకూల ఫలితాలు వస్తాయి.
మడమల పగుళ్లకు కొబ్బరి నూనె దివ్యౌషధంలా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మం తేమను కలిగి ఉండటంలో సహాయపడుతుంది. పొడి చర్మం చికిత్సకు కొబ్బరి నూనె ఉత్తమంగా పరిగణించబడుతుంది. చర్మంలో తేమను నిర్వహించడమే కాకుండా, కొబ్బరి నూనె చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ కొబ్బరి నూనెను ఉపయోగించడం ద్వారా, పగిలిన మడమల సమస్యను నివారించవచ్చు. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల మీ పాదాలు మృదువుగా ఉంటాయి. మీరు మడమల పగుళ్ల సమస్యతో పోరాడుతున్నట్లయితే, కొబ్బరి నూనెతో మీ పాదాలను రోజుకు రెండుసార్లు మసాజ్ చేయండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..