AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సినిమా స్టైల్‌లో దొంగతనం..! ఫ్యూజుల్ అవుట్ అయ్యే స్టంట్‌తో దారి దోపిడీ.. వీడియో చూస్తేనే కిక్కు..!

ఈ సాహస సంఘటన వీడియోను వెనుక కారులోని ఓ ప్రయాణికుడు చిత్రీకరించాడు. ఏ యాక్షన్ చిత్రానికి తగ్గని ఈ అద్భుతమైన సాహసం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. కాగా, ఆ రహదారిలో ఇలాంటి చోరీలు సాధారణమేనని అంటున్నారు పోలీసులు. అంతేకాదు. ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా తమకు అందలేదని చెప్పారు.

Watch Video:  సినిమా స్టైల్‌లో దొంగతనం..! ఫ్యూజుల్ అవుట్ అయ్యే స్టంట్‌తో దారి దోపిడీ.. వీడియో చూస్తేనే కిక్కు..!
Steal Goods From Moving Tru
Jyothi Gadda
|

Updated on: May 26, 2024 | 6:36 PM

Share

కదులుతున్న వాహనంలో దొంగతనం చేయడం, సీసీటీవీ, సెక్యూరిటీ ఉన్నా బ్యాంకును దోచుకోవడంతో పాటు ఎన్నో దారుణమైన దొంగతనాలు సినిమాల్లో చూస్తుంటాం. ఇక్కడ కూడా అలాంటిదే సినిమా స్టైల్లో దొంగతనం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రక్కులోంచి బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వస్తువులను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా స్టైల్లో జరిగిన ఈ చోరీలో దొంగలు చేసి స్టంట్‌ చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. కదులుతున్న లారీని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అనుసరించారు. ఇద్దరు వ్యక్తులు లారీపైకి ఎక్కారు. గూడ్స్‌ బాక్స్‌ దొంగిలించి రోడ్డుపై పడేశారు. ఆ తర్వాత చాలా నైపుణ్యంగా కదులుతున్న బైక్‌పైకి తిరిగి చేరుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దొంగతనానికి సంబంధించిన వీడియో నెటిజన్లకు సినిమాలోని సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది.

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగ్రా-ముంబై జాతీయ రహదారిలోని దేవాస్-షాజాపూర్ హైవే మార్గంలో ఫుల్‌ లోడ్‌తో ఒక లారీ వెళ్తోంది. బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆ లారీని అనుసరించారు. ట్రక్కు వెనుక ఒక వ్యక్తి తన బైక్‌ను నడుపుతున్నాడు. అతని సహచరులు వస్తువులను దొంగిలించే పనిలో ఉన్నారు. ఇద్దరూ ట్రక్కుపైకి ఎక్కి వస్తువులపై కప్పే టార్పాలిన్ షీట్‌ను కత్తిరించారు. ఒక పెట్టె తీసి దానిని రోడ్డుపై విసిరారు. ఆ తర్వాత ఇద్దరూ ట్రక్కులోంచి ఆ వ్యక్తి నడుపుతున్న బైక్ వెనుక సీటులోకి చేరారు. ఆ తర్వాత బైక్ స్లో చేసి వెనక్కు పడిపోయిన వస్తువులను సేకరిస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ విషయం తెలియక ట్రక్కు డ్రైవర్ వాహనం ముందుకు నడుపుతూనే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ సాహస సంఘటన వీడియోను వెనుక కారులోని ఓ ప్రయాణికుడు చిత్రీకరించాడు. ఏ యాక్షన్ చిత్రానికి తగ్గని ఈ అద్భుతమైన సాహసం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరిచింది. కాగా, ఆ రహదారిలో ఇలాంటి చోరీలు సాధారణమేనని అంటున్నారు పోలీసులు. అంతేకాదు. ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా తమకు అందలేదని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..