Viral Video: వామ్మో.. భానుడి ప్రతాపం ఇలా ఉందేంట్రా సామీ..! వీడియో చూస్తే మాడిపోవాల్సిందే..

ఈ దృశ్యాన్ని చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. నిజంగానే ప్రస్తుత రోజుల్లో చాలా చోట్ల భానుడి ప్రతాపంతో విధ్వంసం సృష్టించిందని అంటున్నారు. కొందరు ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం ఇంటర్‌నెట్‌లో సెగలు రేపుతోంది.

Viral Video: వామ్మో.. భానుడి ప్రతాపం ఇలా ఉందేంట్రా సామీ..! వీడియో చూస్తే మాడిపోవాల్సిందే..
Girl Frying Fish
Follow us

|

Updated on: May 26, 2024 | 8:06 PM

దేశంలోని పలు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండ వేడిగాలుల కారణంగా జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా చోట్ల ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. అలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట ఇంటి నుంచి బయటకు వెళ్లడం అంటే నిప్పుల కొలిమిలోకి వెళ్లినట్లే. ఎండల తీవ్రతకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో సరిహద్దు సైనికుడు కాలిపోతున్న ఎడారిలో ఇసుకపై పాపడ్ కాల్చడం కనిపించింది. ఇప్పుడు కూడా అలాంటిదే మరో సీన్‌ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక అమ్మాయి వీడియో ఇంటర్నెట్‌లో వేడిని పెంచింది. అందులో ఆమె ఎండలో నూనె వేడి చేయడం కనిపిస్తుంది. అంతేకాదు, ఎండలో వేడెక్కిన నూనెలో చేపల ఫ్రై చేస్తున్న దృశ్యం నెటిజన్లకు నిజంగానే చెమటలు పట్టిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. నిజంగానే ప్రస్తుత రోజుల్లో చాలా చోట్ల భానుడి ప్రతాపంతో విధ్వంసం సృష్టించిందని అంటున్నారు.

వైరల్‌ వీడియోలో ఒక యువతి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రాయిపై నూనెతో కూడిన ఫ్రైయింగ్ పాన్‌ పెట్టింది. ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో అప్పటికే మసాల పెట్టి ఉంచిన చేపల్ని తెచ్చి వేసింది. ఆమె చేపలను బాణలిలో వేసి వేయించడం ప్రారంభించింది. విపరీతమైన ఎండ వేడి కారణంగా నిప్పు లేకుండానే ఆ నూనె దానికదే వేడిగా మారిందని, అందులో చేపలను కూడా హాయిగా వేయించుకోవచ్చని ఆమె చెప్పింది. ఎండలో నూనె వేడయ్యాక అందులో చేపలు వేయించిన దృశ్యం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ అమ్మాయి పేరు ఉర్మి అని, వీడియో బెంగాల్‌కి చెందినదిగా సమాచారం.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో foodiesuman1 అనే ఐడితో షేర్‌ చేశారు. ‘ఉర్మి ఎండ వేడిమిలో చేపలను ఎలా వేయించాలో చూపించింది అనే శీర్షికతో వీడియో పోస్ట్‌ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటివరకు 5.6 మిలియన్లు అంటే 56 లక్షల సార్లు వీక్షించారు. అయితే లక్ష మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.

అదే సమయంలో వీడియోను చూసిన వినియోగదారులు వివిధ రకాల కామెంట్స్‌ కూడా చేశారు. ఇప్పటికే నూనె వేడెక్కిందని, ఎండలో నూనె వేడెక్కుతుందనే వాదన అవాస్తవమని ఒకరు. ‘ఇప్పుడు మనుషులు కూడా కొద్దిరోజుల తర్వాత ఇలానే ఫ్రై అవుతారంటూ మరికొందరు రియాక్షన్ ఇచ్చారు. మరికొందరు ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం ఇంటర్‌నెట్‌లో సెగలు రేపుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
సైకిల్ నేర్చుకునే ఏజ్లో స్కూటర్ నడుపుతున్న బాలుడు.. వీడియో వైరల్
సైకిల్ నేర్చుకునే ఏజ్లో స్కూటర్ నడుపుతున్న బాలుడు.. వీడియో వైరల్
“మెదడును తినే అమీబా” ఐదేళ్ల బాలికను మింగేసింది..
“మెదడును తినే అమీబా” ఐదేళ్ల బాలికను మింగేసింది..
తెలంగాణ బీజేపీలో కేంద్రమంత్రులకు సన్మానాలపై రచ్చ జరుగుతోందా..?
తెలంగాణ బీజేపీలో కేంద్రమంత్రులకు సన్మానాలపై రచ్చ జరుగుతోందా..?
రోజంతా సాధారణ కూలీగా సివిల్ సర్వెంట్.. ఎందుకు అలా చేశారంటే.!
రోజంతా సాధారణ కూలీగా సివిల్ సర్వెంట్.. ఎందుకు అలా చేశారంటే.!
అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తో కాదా..?
అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తో కాదా..?
శీతల పానీయాలు తెగ తాగేస్తున్నారా.. ఆరోగ్యానికి ఎంత హనికరమో తెలుసా
శీతల పానీయాలు తెగ తాగేస్తున్నారా.. ఆరోగ్యానికి ఎంత హనికరమో తెలుసా
'ఇది జట్టు కాదు.. నిప్పుల కుంపటి' పాక్ కోచ్ షాకింగ్ స్టేట్‌మెంట్
'ఇది జట్టు కాదు.. నిప్పుల కుంపటి' పాక్ కోచ్ షాకింగ్ స్టేట్‌మెంట్
చిక్కనంటున్న టమాట.. ధర ఏంటి ఒక్కసారిగా ఇలా..?
చిక్కనంటున్న టమాట.. ధర ఏంటి ఒక్కసారిగా ఇలా..?
మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..
మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..
అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?
అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?