AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: బిడ్డ పుట్టిన తర్వాత మీ భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి చిట్కాలు

Relationship Tips: బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య దూరం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు ఎక్కువ సమయం బిడ్డ కోసం కేటాయిస్తుంటారు. అలాంటి సమయంలో..

Relationship Tips: బిడ్డ పుట్టిన తర్వాత మీ భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి చిట్కాలు
Relationship Tips
Subhash Goud
|

Updated on: Sep 08, 2022 | 9:11 AM

Share

Relationship Tips: బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య దూరం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు ఎక్కువ సమయం బిడ్డ కోసం కేటాయిస్తుంటారు. అలాంటి సమయంలో భార్యాభర్తల మధ్య కొంత గ్యా్‌ప్‌ ఏర్పడుతుంది. ఒకరిపై ఒకరు ప్రేమను తగ్గించుకుంటారు. తల్లిదండ్రుల పూర్తి దృష్టి వారి పిల్లలపై మాత్రమే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు వారు తమ భాగస్వామికి సమయం ఇవ్వకపోవడంతో క్రమంగా సాన్నిహిత్యం దూరం అవుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొవాల్సిన అవసరం లేదని మీరు కోరుకుంటే కొన్ని చిట్కాలను పాటించడం మేలు. ఈ చిట్కాలను ప్రయత్నించడం ద్వారా భాగస్వామికి మధ్య బంధాన్ని శాశ్వతంగా దృఢంగా మార్చుకోవచ్చు.

భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తారు. శిశువు పుట్టిన తరువాత జంటలు తమలో తాము మాట్లాడుకోలేరు. దీని కారణంగా అనేక విషయాలు అలాగే ఉండిపోతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలు పెద్దగా మారడం ప్రారంభం అవుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు శిశువును ఇంట్లో ఉండే వాళ్లతో కొంత సేపు వదిలిపెట్టాలి. ఆ సమయంలో మీ భాగస్వామికి సమయం ఇవ్వాలి.

తగినంత నిద్ర పొందడానికి ప్రయత్నించండి :

ఇవి కూడా చదవండి

చిన్నపిల్లలు రాత్రిపూట నిద్రపోరు. రోజంతా నిద్రించి రాత్రుల్లో నిద్రపోకుండా దంపతులను సైతం నిద్రపోనివ్వకుండా చేస్తారు. నిద్ర చెదిరిపోవడం వల్ల ఇద్దరికీ రోజంతా చిరాకుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శిశువును జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు మీ బిడ్డ పగటిపూట నిద్రపోకుండా ప్రయత్నించండి. తద్వారా రాత్రిపూట త్వరగా గాఢంగా నిద్రపోతాడు.

హనీమూన్ లాగా, బేబీమూన్ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తరచుగా బిడ్డ పుట్టిన తర్వాత బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. బిడ్డతో బయటికి వెళితే రకరకాల సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతారు. కానీ, భాగస్వామి గురించి ఆలోచించడం మర్చిపోతుంటారు. అటువంటి పరిస్థితిలో మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి బేబీమూన్ ప్లాన్ చేయండి. మీరు ఏదైనా అందమైన, మీకు ఇష్టమైన ప్రదేశంలో మీ భాగస్వామి, పిల్లలతో సమయాన్ని గడపాలి. ఇలాంటి సమయాల్లో కూడా మీ సంబంధంలో ప్రేమను పెంచుతుంది. మీరు అనవసరమైన విషయాల నుండి స్వల్ప విరామం పొందుతారు. మీరు ఇంటి నుండి చాలా దూరం వెళ్ళే స్థితిలో లేకుంటే మీరు మీ నగరం చుట్టూ ఉన్న ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు. ఇలా ముందస్తుగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే భాగస్వామితో గడిపితే బాగుంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఇంట్లో చూసుకునేవారు ఉంటే మరి మంచిది. ఎవరైనా పెద్దవాళ్లను ఇంట్లో ఉంచుకుని ఉంటే దంపతులకు కాస్త మాట్లాడుకునే సమయం దొరుకుతుంది. ముందస్తు ప్లాన్‌ చేసుకుంటే భాగస్వామి మధ్య దూరం ఏర్పడకుండా ప్రేమానురాగాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే శిశువు పుట్టిన తర్వాత ఎక్కువ వారిపైనే దృష్టి మళ్లుతుంది. అలాంటి సమయంలో అటు పిల్లలపై ఇటు భాగస్వామి మధ్య బంధం చెదిరిపోకుండా ఉంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

(నోట్‌: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఇంకా ఏవైనా సలహాలు, సూచనల కావాలంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి