Relationship Tips: ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు.. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నాడని అర్ధమట
భార్యాభర్తల బంధానికి ప్రేమ, నమ్మకం ఆధారం. అయితే కొంతమంది తమని నమ్మిన భాగస్వామిని కూడా మోసం చేస్తున్నారు. అలా భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పే కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఎందుకంటే జీవిత భాగస్వామి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఈ విషయాలను సకాలంలో అర్థం చేసుకోవడం ముఖ్యం. కనుక మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలియజేసే సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం..

భార్యాభర్తల సంబంధం ప్రేమ , నమ్మకం ఆధారంగా నిండు నూరేళ్ళు కొనసాగుతుంది. అయితే ఈ బంధంలో నమ్మకం పోవడం మొదలైతే.. ఆ సంబంధం బలహీనంగా మారుతుంది. కొంతమంది జీవిత భాగస్వామి తన జీవిత భాగస్వామికి తెలియకుండా కొన్ని పనులను రహస్యంగా చేస్తాడు. అటువంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి ప్రవర్తన మారి, అతను లేదా ఆమె భిన్నంగా కనిపిస్తే, అది ఆందోళన కలిగించే విషయం కావచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పే కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా నిర్లక్షం చేయడం సరైన పద్దతి కాదు. మీ భార్తభార్తల బంధం గురించి సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఈ విషయాలను సకాలంలో గుర్తించాలి. ఈ రోజు భాగస్వామి మోసం చేస్తున్నాడు అని తెలియజేసే సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం..
చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం లేదా చిరాకు పడటం మీ భార్య లేదా భర్త ఎటువంటి కారణం లేకుండా కోపంగా ఉండటం ప్రారంభిస్తే.. అది మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అన్న విషయానికి ఒక సంకేతం కావచ్చు. చిన్న చిన్న విషయాలకే తన భాగస్వామితో వాదించడం ప్రారంభిస్తాడు. మోసం చేస్తున్నాను అన్న అపరాధ భావన కలిగి ఉండటం.. లేదా తన భాగస్వామితో మాట్లాడకూడదని కోరుకోవడం కారణం కావచ్చు. ఇటువంటి మార్పు అకస్మాత్తుగా ప్రారంభమైతే జాగ్రత్తగా ఉండండి.
ఫోన్, సోషల్ మీడియాను దాచడం మీ భాగస్వామి అకస్మాత్తుగా తన ఫోన్‌ను దాచడం ప్రారంభించినా లేదా పాస్‌వర్డ్‌లను మార్చినా.. అది ఆందోళన కలిగించే విషయం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ భర్తకు లేదా భార్యకు ఏమీ చెప్పకపోవడం కూడా అనుమానం కలిగించే విషయమే. భార్యాభర్తల మధ్య సంబంధంలో స్పష్టత ఉంటే ఏదీ దాచాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు మీ భాగస్వామి మొబైల్ ఫోన్ ని చూస్తూ పదే పదే నవ్వుతూ ఉండటం.. మీకు ఎటువంటి కారణం చెప్పకపోవడం కూడా జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నాడనేదానికి సంకేతం కావచ్చు.
సమయం ఇవ్వకపోవడం, దూరం పాటించడం మీ భాగస్వామి మునుపటిలా సమయం ఇవ్వకపోయినా, ఎల్లప్పుడూ బిజీగా ఉన్నట్లు సాకు చెబుతున్నా.. భార్యాభర్తల సంబంధం బలహీనపడుతోందని అర్ధమట. భార్తభార్తల మధ్య ప్రేమని పెంచేందుకు ఒకరికొకరు సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఈ నేపధ్యంలో మీ జీవిత భాగస్వామి మీకు దూరం పాటించడం లేదా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం కూడా మోసం చేస్తున్నట్లు సూచనట. ఇది దంపతుల మధ్య భావోద్వేగ సంబంధం లేకపోవడాన్ని చూపుతుంది.
చూపులు, ప్రవర్తనలో ఆకస్మిక మార్పు. తమ జీవిత భాగస్వామిని మోసం చేయడం ప్రారంభించినప్పుడు.. వారు తరచుగా తన లుక్స్, డ్రెస్సింగ్ పై ఎక్కువ శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు. కొత్త బట్టలు, పరిమళ ద్రవ్యాలు, హెయిర్ స్టైల్స్ వంటి వాటిని తరచుగా మార్చుకోవడం ప్రారంభిస్తారు. అంతేకాదు ప్రవర్తన కూడా మారుతుంది. జీవిత భాగస్వామిని విస్మరించడం చేస్తారు. ఇటువంటి మార్పులన్నీ ఎవరో కొత్త వ్యక్తి మీ భాగస్వామి జీవితంలో ప్రవేశించడం జరగవచ్చు.
అబద్ధం చెప్పడం లేదా అంశాన్ని వక్రీకరించడం మీ జీవిత భాగస్వామి విషయాలు దాచడం లేదా ప్రతిదానికీ సాకులు చెప్పడం ప్రారంభించినట్లయితే.. అది భార్యాభర్తల మధ్య బంధానికి ప్రమాదకరమైన సంకేతం కావచ్చు. మీ భాగస్వామి ఎక్కడికి వెళ్ళారు? ఎవరితో ఉన్నారు? అనే విషయాలపై సమాధానం చెప్పారు. ప్రతి చిన్న దానికి అబద్ధం చెబుతారు. ఇలా అబద్ధం చెప్పి పట్టుబడినప్పుడు .. ఆకారంగా కోపంగా స్పందించడం సాధారణం అవుతుంది. నిజం దాచి అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే.. భార్యాభర్తల సంబంధం విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుందని అర్ధమట.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








