Ayurveda Tips: నెయ్యితో వీటిని కలిపి తింటే విషంతో సమానం.. పొరపాటున కూడా తినొద్దు
నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అంతేకాదు నెయ్యిని పిల్లలు పెద్దలు అన్నంలో, పప్పులో, చపాతీ లేదా దోసె వంటి ఆహారాలతో కలిపి తింటారు. ఇక చాలామంది నెయ్యిని నూనెకు బదులుగా కూరగాయలు, బిర్యానీ వంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే నెయ్యితో తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయని మీకు తెలుసా.. నెయ్యితో కలిపి ఏ ఆహారాలు తింటే ఆరోగ్యానికి హానికరమో ఈ రోజు తెలుసుకుందాం..

భారతీయ ఇళ్లలో వంటలలో నెయ్యిని విరివిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే నెయ్యి ఆహార రుచిని పెంచుతుంది. చాలా మంది అన్నం, రోటీ వంటి వాటిని నెయ్యితో కలిపి తినడానికి ఇష్టపడతారు. నెయ్యిని పప్పు, కిచిడి, బియ్యంలో కలిపి కూడా తింటారు. చాలా మంది కూరగాయలను నెయ్యితో కూడా వండుతారు. అయితే కొంతమంది నెయ్యిని తినే ప్రతి ఆహరంలో వేసుకుని తింటారు. అయితే నెయ్యితో కొన్ని రకాల ఆహారపదార్ధాలను కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం.
వాస్తవానికి ఆయుర్వేదంలో నెయ్యిని కొన్ని రకాల ఆహార పదార్థంతోనూ కలిపి తినకూడదని చెప్పబడింది. ఎందుకంటే ఈ కాంబినేషన్ వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. నెయ్యి తినడం చర్మానికి , ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. దీనిని సరైన పద్దతిలో తినకపోతే ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని వస్తువులతో నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల సలహా ఏమిటంటే..
ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ.. నెయ్యితో కొన్ని ఆహార ఆహారపదార్ధాలను కలిపి తినవద్దు అని చెప్పారు. ఈ కాంబినేషన్ లో నెయ్యిని తినడం వలన జీర్ణ సమస్యలు వస్తాయని చెప్పారు. కొన్ని ఆహార పదార్ధాలతో కలిపి పొరపాటున కూడా నెయ్యిని తినకూడదని.. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి హానికరం అని ఆయన అన్నారు.
తేనెతో నెయ్యి తినవద్దు నెయ్యి , తేనె రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం.. వీటిని ఎప్పుడూ కలిపి తినకూడదు. దీన్ని కలిపి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. ఈ రెండు వస్తువులను కలిపి తినడం విషంతో సమానం.
టీ లేదా కాఫీతో సర్వసాధారణంగా టీ .. కాఫీలలో నెయ్యి కలిపి తీసుకోరు. అయితే ప్రస్తుతం కొంతమంది పీరియడ్స్ నొప్పులను తగ్గించడానికి టీ లేదా కాఫీలో నెయ్యి జోడించి తాగమని చెబుతున్నారు. అయితే ఇలా చేయడం పూర్తిగా తప్పు. ఎందుకంటే.. టీ లేదా కాఫీతో నెయ్యి కలిపి తాగడం వలన జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఆమ్లత్వ సమస్య ఏర్పడుతుంది.
చేప- నెయ్యి చేపలు, నెయ్యి అస్సలు కలిపి తినకూడదు. నెయ్యి వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. చేపలు చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కనుక విరుద్ధ స్వభావాన్ని కలిగి ఉన్న వీటిని తినడం వల్ల అలెర్జీలు, దురద వంటి చర్మ సమస్యలు ఏర్పడతాయి. కనుక చేపలను ఎల్లప్పుడూ నూనెలో వేయించాలి.
పాలు- నెయ్యి నెయ్యి .. పాలు రెండూ ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవే., అయితే నెయ్యి పరిమాణం ఎక్కువగా ఉండి.. పాలు వేడిగా ఉంటే.. ఈ ఆహారం భారీగా ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. శరీరంలో సోమరితనం పెరుగుతుంది. అందువల్ల పాలలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల మీకు ప్రయోజనం చేకూరే బదులు ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
ముల్లంగితో నెయ్యి ముల్లంగి స్వభావం చల్లగా ఉంటుంది. అయితే నెయ్యి స్వభావం వేడిగా ఉంటుంది. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత తీవ్రమవుతుంది. కడుపు నొప్పి లేదా ఆమ్లత్వం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కనుక ఈ రెండు వస్తువులను కలిపి తినవద్దు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








