Ghee Beauty Tips: మీ చర్మం మెరిసిపోవాలంటే నెయ్యితో ఇలా చేయండి..! యవ్వనంగా కూడా కనిపిస్తారు..!
మన చర్మం ఆరోగ్యంగా తాజాగా ఉండాలంటే ముఖ్యంగా అవసరమయ్యేది కొల్లాజెన్ అనే ప్రోటీన్. ఇది చర్మానికి దృఢత్వాన్ని, లావుతనాన్ని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఈ కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అయితే ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నెయ్యితో మసాజ్ చేయడం వల్ల ఈ కొల్లాజెన్ ఉత్పత్తిని మళ్లీ పెంచవచ్చని చెబుతున్నారు.

నెయ్యిని ఆరోగ్యానికి మంచిదని మాత్రమే కాదు.. అందానికి ఒక ఆయుధంగా కూడా భావిస్తారు. దీనిని లిక్విడ్ గోల్డ్ అని పిలిచేంతగా ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్ A, E కొవ్వు ఆమ్లాలు ఇందులో ప్రధానంగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన పోషణను అందించడమే కాకుండా.. తేమను మెరుగుపరుస్తాయి.
ముఖానికి నెయ్యి మసాజ్ చేయకముందు ముఖం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మేకప్, మురికి లేకుండా వాష్ చేసి శుభ్రం అయ్యాకే మసాజ్ ప్రారంభించాలి. నెయ్యిని కొద్దిగా తీసుకుని గోరువెచ్చగా చేసి మెల్లగా ముఖంపై మసాజ్ చేయాలి.
వెచ్చగా చేసిన నెయ్యిని కొద్దిగా తీసుకుని ముఖంపై అప్లై చేయాలి. తర్వాత ఒత్తిడి లేకుండా గుండ్రంగా నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇది చర్మంలోని లోతైన పొరల వరకు పోషణను అందించి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ముక్కునే కాదు, కళ్ల చుట్టూ, నోటి భాగం వద్ద ఉండే ముడతలపై కూడా సున్నితంగా మసాజ్ చేయాలి.
కేవలం ముఖానికే కాదు.. చేతులు, కాళ్లు, మెడ ఇతర శరీర భాగాలకు కూడా నెయ్యితో మసాజ్ చేయవచ్చు. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది. పొడి చర్మం సమస్యలు తగ్గుతాయి. వయసు పెరుగుతున్నా చర్మం జిడ్డు లేకుండా కనిపించడానికి ఇది సహాయపడుతుంది.
నెయ్యితో మసాజ్ చేసిన తరువాత కనీసం 30 నుండి 60 నిమిషాల పాటు శరీరంపై అలాగే వదిలేయాలి. ఆ తర్వాత సున్నితమైన బేబీ సోప్ లేదా ఆయుర్వేద సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదుత్వాన్ని పొందుతుంది. తక్కువ సమయంలో మార్పు కనిపిస్తుంది.
ఈ విధంగా నెయ్యితో మసాజ్ చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారడమే కాకుండా.. వయసు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అయితే క్రమం తప్పకుండా శుభ్రత పాటిస్తూ చేస్తే మాత్రమే మంచి ఫలితాలు పొందవచ్చు.




