AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ సంఖ్యలో జన్మించిన పిల్లలు గొప్ప తెలివి తేటలుగలవారు.. టీచర్ వృత్తి బెస్ట్ ఎంపిక..

సంఖ్యాశాస్త్రం అనేది ఒక సంఖ్య, మన జీవితాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక పద్ధతి. ఇది అక్షరాల ద్వారా సంఖ్యలను లెక్కించడం ద్వారా పనిచేస్తుంది. ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్ట సంఖ్య ఉంటుంది. ఈ సంఖ్యలు వ్యక్తిత్వం, విధి,భవిష్యత్తును అంచనా వేయడానికి ఉపయోగించబడతాయి. ఈ రోజు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ సంఖ్యలో జన్మించిన పిల్లలు ఉపాధ్యాయులుగా మారి ప్రతి విషయంలోనూ ప్రావీణ్యం సాధిస్తారు. ఈ రోజు ఏ పుట్టిన తేదీ, ఏ మూల సంఖ్య ఉన్న పిల్లలు టీచర్ వృత్తిని ఎంచుకుంటారో తెలుసుకుందాం..

Numerology: ఈ సంఖ్యలో జన్మించిన పిల్లలు గొప్ప తెలివి తేటలుగలవారు.. టీచర్ వృత్తి బెస్ట్ ఎంపిక..
Numerology Birth Date
Surya Kala
|

Updated on: Jun 01, 2025 | 7:25 PM

Share

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి పుట్టిన తేదీ అయినా కేవలం ఒక తేదీ మాత్రమే కాదు.. అది అతని స్వభావం, జీవిత ప్రయాణానికి అద్దం కూడా.. దీనిలో వ్యక్తీ గుర్తింపు, భవిష్యత్తు సంకేతాలు దాగి ఉంటాయి. ప్రతి వ్యక్తి పుట్టిన తేదీ తో ఒక ప్రత్యేక మూల సంఖ్య ఉంటుంది. ఇది అతని వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, భవిష్యత్తు అవకాశాల గురించి తెలియజేస్తుంది. ఈ సంఖ్య వెనుక ఒక నిర్దిష్ట గ్రహం ప్రభావం ఉంటుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు, ఆలోచనలపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఒక ప్రత్యేక సంఖ్యలో అంటే 3, 12, 21, 30 సంఖ్యలలో జన్మించే పిల్లల భవిష్యత్ గురించి తెలుసుకుందాం. వీరు కష్టపడి పనిచేసేవారు.. జ్ఞానానికి నిలయం.

పుట్టిన తేదీ, మూలాధారం.

  1. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన పిల్లలకు మూల సంఖ్య 3 ఉంటుంది. రాడిక్స్ 3 పాలక గ్రహం బృహస్పతి (గురువు).
  2. సంఖ్యాశాస్త్రం: ఈ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు తమ స్నేహితులను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టరు. వీరు స్నేహితులతో కలిసే సమయాన్ని అపురూపంగా భావిస్తారు. స్నేహం అంటే ప్రాణం ఇస్తారు.
  3. 3వ సంఖ్య ఉన్న పిల్లలు కష్టపడి పనిచేసేవారు, ధైర్యవంతులు. వీరు ఏ పనినైనా పూర్తి అంకితభావంతో, కృషితో పూర్తి చేస్తారు. నిజాయితీపరులు, అవగాహన కలిగి ఉంటారు. వీరు ఏదైనా కొత్త విషయం గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాదు వీరు ఏ రంగంలో పనిచేసినా తమదైన ముద్ర వేస్తారు.
  4. సంఖ్యాశాస్త్రం ప్రకారం 3వ సంఖ్య ఉన్న పిల్లలను జ్ఞాన భాండాగారంగా పరిగణిస్తారు. వీరు జ్ఞానంతో నిండి ఉంటారు. పిల్లలు జ్ఞానం, పదునైన తెలివితేటల కారణంగా చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే వీరు పెద్దయ్యాక ఉపాధ్యాయులు అవుతారు.
  5. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. 3వ సంఖ్య ఉన్న పిల్లలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు తమ మాటలతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. అంతేకాదు వీరికి సమాజం, కుటుంబ సభ్యుల నుంచి చాలా ప్రేమ లభిస్తుంది.
  6. 3వ సంఖ్య ఉన్న పిల్లలు తమ కెరీర్‌లో చాలా ఉన్నత స్థానాలను సాధిస్తారు. వీరికి ప్రతి రంగంపైనా జ్ఞానం ఉంది. అందుకే వీరు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తారు. ఏ పని చేయలన్నా తెలివిగా నిర్ణయం తీసుకుంటారు.
  7. 3వ మూల సంఖ్య ఉన్న వ్యక్తులు చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ గురువులు, ఉపాధ్యాయులు, పెద్దలతో చుట్టూ ఉంటారు. వీరు ఇతరుల సమస్యలను పరిష్కరించే మధ్యవర్తి అవుతారు. సరైన సలహా కోసం చూస్తున్న వారికి చాలా మంచి మార్గదర్శకులు. ఈ వ్యక్తులు తమకు తెలిసిన వ్యక్తులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు.
  8. వీరు ఎల్లప్పుడూ తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. వీరు మంచి గురువు, గైడ్, కౌన్సెలర్, తత్వవేత్త, రచయిత, ప్రొఫెసర్ కావచ్చు. వీరికి ఇవి చాలా ఉత్తేజకరమైన రంగాలు. ఈ సంఖ్య గల వ్యక్తులు ఈ కెరీర్ ను ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నించడం మంచి ఎంపిక.
  9. వీరు పసుపు, నారింజ రంగులు ఈ వ్యక్తులకు అదృష్ట రంగులు, ఈ రంగులను ఉపయోగించినప్పుడు వారు ప్రశాంతంగా, విశ్రాంతిగా ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు