Cake Recipe: టూటీ ఫ్రూటీ కేక్ అంటే ఇష్టమా.. ఎగ్ లెస్ కేక్ ని ఇంట్లోనే టేస్టీటేస్టీ గా చేసుకోండి.. రెసిపీ మీ కోసం..
కేక్ అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇష్టపడతారు. ముఖ్యంగా చిన్నతనంలో మధురమైన జ్ఞాపకంగా టూటీ ఫ్రూటీ కేక్. దీనిని గుడ్లు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కనుక ఈ రోజు రుచికరమైన టూటీ ఫ్రూటీ కేక్ ని తయారు చేసే పద్ధతి గురించి తెలుసుకుందాం.. రెసిపీ మీ కోసం..

ప్రస్తుతం మార్కెట్ లో రకరకాల కేక్ లు లభిస్తున్నాయి. చాక్లెట్, వెనిల్లా, రెడ్ వెల్వెట్ వంటి అనేక రకాల కేక్‌లు దొరుకుతున్నాయి. అయితే ఈ రోజు మనం ఇంట్లో టూటీ ఫ్రూటీ కేక్ తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.. ఈ కేక్ మీ చిన్ననాటి జ్ఞాపకాలు, రంగురంగుల రుచులు, తేలికపాటి తీపి కలయిక, దీనిని అన్ని వయసుల వారు ఇష్టంగా తింటారు. ఈ కేక్ ని గుడ్లు లేకుండా కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో స్పెషల్ గా ఏదైనా స్వీట్ లేదా కేక్ ని తయారు చేయాలని భావిస్తే.. ఖచ్చితంగా ఈ రుచికరమైన కేక్‌ని ప్రయత్నించండి. కనుక ఈ రోజు టూటీ ఫ్రూటీ కేక్ ని తయారు చేసే పద్ధతి గురించి తెలుసుకుందాం..
టూటీ ఫ్రూటీ కేక్ తయారీ కోసం కావలసినవి
- మైదా – 1 కప్పు
- బేకింగ్ పౌడర్ – 1 స్పూన్
- బేకింగ్ సోడా – అర టీస్పూన్
- ఉప్పు – 1 చిటికెడు
- చక్కెర – అర కప్పు
- పాలు – ఉడికించినవి
- పెరుగు – అర కప్పు
- నూనె లేదా వెన్న – అవసరమైనంత
- వెనిల్లా ఎసెన్స్ – 1 స్పూన్
- నిమ్మరసం – 1 స్పూన్
- టూటీ ఫ్రూటీ – అర కప్పు
టూటీ ఫ్రూటీ కేక్ ఎలా తయారు చేసుకోవాలంటే
- మీరు పాన్‌లో కేక్ తయారు చేసుకోవాలనుకుంటే.. ముందుగా పాన్ లో ఉప్పు లేదా ఇసుక వేసి, మూతపెట్టి, మీడియం మంట మీద 10 నిమిషాలు వేడి చేయండి.
- ఇప్పుడు టూటీ ఫ్రూటీ కేక్ చేసుకునేందుకు టూటీ ఫ్రూటీలకు 1 స్పూన్ మైదా పిండి వేసి కలపండి.
- ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దానిలో పెరుగు, చక్కెర , నూనె వేసి బాగా గిలక్కొట్టి.. దానికి పాలు, వెనిల్లా ఎసెన్స్ జోడించండి.
- దీని తరువాత ఈ మిశ్రమానికి నిమ్మరసం వేసి బాగా కలపండి.
- ఇప్పుడు మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వంటి పదార్థాలను వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పిండి మృదువుగా వచ్చేలా చేయాలి.
- ఇలా మృదువుగా చేసిన పిండిలో టూటీ ఫ్రూటీలు వేసి పిండిని బాగా కలపండి.
- ఇప్పుడు కేక్ కంటైనర్‌లో పిండిని పోసి.. దాని పైన కొంచెం టూటీ ఫ్రూటీని చల్లండి.
- కేక్‌ను పాన్‌లో 45-50 నిమిషాలు వేడి చేయండి.
- చివరగా టూత్‌పిక్‌ని తో కేక్ ఉడికిందో లేదో తనిఖీ చేయండి. ఇప్పుడు టేస్టీ టేస్టీ మృదువైన టూటీ ఫ్రూటీ కేక్ రెడీ.
- టూటీ ఫ్రూటీ కేక్‌ను 10–15 నిమిషాలు చల్లబరిచి.. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








